అంతర్జాతీయ యోగా దినోత్సవం(World Yoga Day) సందర్భంగా యోగా చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి(Central Party) పశుపతి కుమార్ పరాస్(Pashupati Kumar Paras) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కేంద్రమంత్రి వేదికపైనే పడిపోవడంతో గందరగోళం నెలకొంది. పక్కనే ఉన్న అధికారి, ఆయన పీఏ పశుపతి కుమార్ పరాస్‌ను లేపి సోఫాలో కూర్చోబెట్టారు.

Pashupati Kumar Paras

సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ బుధవారం ఉదయం హాజీపూర్‌లోని(Hajipur) కొన్హారా(Konhara) సమీపంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరానికి వెళ్లారు. వేదికపై మంత్రితోపాటు మరికొందరు యోగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా మంత్రి పశుపతి పరాస్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో యోగా చేయలేక వేదికపై పడిపోయారు. అక్కడే ఉన్న అధికారి, మంత్రి పీఏ ఆయనను ఎత్తి సోఫాలో కూర్చోబెట్టారు.
పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ.. గతంలో తన కారు గొయ్యిలో(Car Accident) పడిందని, దీంతో కొంత శారీరక సమస్య తలెత్తిందని తెలిపారు. నా ఆరోగ్యం బాగాలేదు. గతంలో ముజఫర్‌పూర్‌కు వెళ్తుండగా వాహనం గొయ్యిలో బోల్తా పడడంతో శారీరక ఇబ్బంది ఏర్పడింది. శారీరక సమస్య కారణంగా యోగా చేయడంలో ఇబ్బంది ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటానని తెలిపారు.