తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం(Medaram) సమ్మక్క, సారక్క జాతరకు(Samakka-sarakka) ప్రత్యేక రైళ్లను(Special trains) నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ఆయన అన్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్-వరంగల్, నిజామాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ మార్గంలో నడుస్తాయని కేంద్రమంత్రి చెప్పారు
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం(Medaram) సమ్మక్క, సారక్క జాతరకు(Samakka-sarakka) ప్రత్యేక రైళ్లను(Special trains) నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ఆయన అన్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్-వరంగల్, నిజామాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ మార్గంలో నడుస్తాయని కేంద్రమంత్రి చెప్పారు. బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు తదితర ప్రాంతాల్లోని భక్తులకు.. ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి.
07017/07018: సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్
07014/07015: సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్
07019/07020: నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్
నరేంద్రమోదీ(Narendra modi) ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే.. సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం మూడు కోట్ల రూపాయలను కేటాయించిందని చెప్పుకొచ్చారు.