ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రన్ చేసే కంటెంట్‏పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్న వెబ్ సిరీస్‏లలో బోల్డ్ కంటెంట్, బూతులు ఎక్కువ ఉండటంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓటీటీల్లో అశ్లీలత అనేది పరిమితికి మించి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనుకాడదని కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో న్యూడ్ కంటెంట్ పెరుగుతోందన్న ఫిర్యాదులపై కేంద్రప్రభుత్వం గుర్రుగా ఉంది. దీనికి సంబంధించి నింబంధనలలో ఏమైనా మార్పులు చేయాల్సిన విషయంపై సమాచారశాఖ పరిశీలిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ‘కాలేజీ రొమాన్స్’ వెబ్ సిరిస్‏పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటీటీ కంటెంట్‏లో సెక్సువల్ సీన్స్ ఎక్కువగా ఉంటే.. అవి ఆడియన్స్ మైండ్‏ను డైవర్ట్ చేస్తాయని కోర్టు పేర్కొంది. ఇలాంటి వాటిని సెన్సార్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉంటే ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే కంటెంట్ రూల్స్ ను అతిక్రమిస్తే ప్రభుత్వ చర్యలు తప్పవని కేంద్రమంత్రి అన్నారు.

ఇక ఓటీటీకి సెన్సార్ విధానం ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్‏ను సుప్రీంకోర్టు గతేడాది తిరస్కరించింది. అన్ని రకాల ఓటీటీ కంటెంట్‏ను సమీక్షించడానికి ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా.. అటువంటి ప్రక్రియను చేపట్టడం అసాధ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated On 20 March 2023 2:12 AM GMT
Ehatv

Ehatv

Next Story