క్రిమినల్ చట్టాల్లో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) శుక్రవారం లోక్ సభ(Lok Sabh)లో ప్రవేశపెట్టారు. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత–2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత–2023,
క్రిమినల్ చట్టాల్లో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) శుక్రవారం లోక్ సభ(Lok Sabh)లో ప్రవేశపెట్టారు. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత–2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత–2023, ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ) స్థానంలో భారతీ సాక్ష్య –2023ను తీసుకురానుంది. బిల్లులపై మరింత చర్చించేందుకు స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేసినట్లు ఆయన తెలిపారు.
క్రిమినల్ ప్రొసిజర్‌లో 313 మార్పులు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌లో వీడియోగ్రఫీ తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. గ్యాంగ్‌రేప్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, మైనర్లపై అత్యాచారం కేసుల్లో.. మూక దాడులకు పాల్పడినా మరణశిక్ష అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.