మన దేశ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పాఠశాల విద్యలో నైపుణ్యతకు పెద్ద పీట వేయాల్సిన ఆగత్యమూ ఉంది. సమాచారం, సృజనాత్మకతక, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం వంటివాటిని విద్యాబోధనలో తప్పనిసరిగా చేర్చాల్సిన అంశాలు. ఆధునిక ప్రపంచంలో నెట్టుకురావడానికి అవసరమైన సామర్థ్యం కావాలి. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు విధ్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి సిద్ధమయ్యాయి. దానిపై దృష్టి పెట్టాయి.

మన దేశ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పాఠశాల విద్యలో నైపుణ్యతకు పెద్ద పీట వేయాల్సిన ఆగత్యమూ ఉంది. సమాచారం, సృజనాత్మకతక, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం వంటివాటిని విద్యాబోధనలో తప్పనిసరిగా చేర్చాల్సిన అంశాలు. ఆధునిక ప్రపంచంలో నెట్టుకురావడానికి అవసరమైన సామర్థ్యం కావాలి. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు విధ్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి సిద్ధమయ్యాయి. దానిపై దృష్టి పెట్టాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానం ఈ కోవలోకే వస్తుంది. నేషనల్ కర్రికులమ్ ఫ్రేమ్‌వర్క్‌(National Curriculum Frame Work)విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికి తీసే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌(Skills Report) ప్రకారం మన దేశంలో కేవలం 50 శాతం యువత మాత్రమే ఉపాధి నైపుణ్యాలు కలిగి ఉన్నారని తెలుస్తోంది. మిగతా 50 శాతం మంది యువతలో నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అత్యుత్తమ విద్యకు అయిదు సీలు అవసర. క్రిటికల్‌ థింకింగ్‌, క్రియేటివిటీ, కమ్యూనికేషన్‌, క్యారెక్టర్‌.. విద్యార్థులు విమర్శనాత్మకంగా ఆలోచించడానికి, సృజనాత్మకతను స్వీకరించడానికి, ఇతరులతో సమాచారాన్ని పంచుకోవడానికి, సహకరించడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. బాధ్యాతయుతమైన ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతాయి.

21 శతాబ్దపులో ఎదురవుతున్న సంక్లిష్టతలను అధిగమించడానికి విద్యార్థులకు ఇవి దోహదపడతాయి. వారిని వినూత్నమైన వ్యక్తులుగా తయారు చేస్తాయి. ప్రాథమిక దశలోనే పిల్లలలోని నైపుణ్యతను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి విద్యను అందించాలి. ఎప్పటికప్పుడు విద్యా బోధనలో మార్పులు తీసుకురావాలి. ఏ రోజూ పాఠ్యాంశాలను ఆ రోజే పరిణతి సాధించాలి. బోధన పద్దతులలో నవ్యత ఉండాలి. విద్యార్థులు కొత్తదనాన్ని అనుభవిస్తూ ఉండాలి. విద్యార్థులు ఆరంభం నుంచి పఠనాసక్తిని పెంచుకోవాలి.

తెలుసుకోవాలనే తపన కలిగాలి. పిల్లలకు విభిన్న అభ్యాస అనుభవాలు అవసరం. మూస పద్దతిలో బోధించడం వల్ల వారి ప్రత్యేక అవసరాలు తీరడం లేదు. తరగతి గదులు కేవలం శబ్ధ నైపుణ్యాలకే పరిమితం కాకూడదు. పాఠ్యాంశాలతో పాటు ఆటపాటలు కూడా పిల్లలకు అవసరమే! నృత్యం, గానం, నటన, రచన ఇలాంటి కళలను పిల్లలకు బోధించాలి. విద్యార్థుల తెలివి తేటలకు మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు ఎట్టి పరిస్థుల్లోనూ కొలమానాలు కావు. ప్రస్తుతం యువత సంక్లిష్ట పరిస్థితులో ఉంది. కేవలం ఒక విషయంలో పరిజ్ఞానం ఉంటే సరిపోదు.

అనేక విషయాలలో ఆరితేరాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలరు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జాతీయ విద్యా విధానంలో ఎప్పటికప్పుడు మార్పులను తీసుకొస్తున్నారు. ఓ లీడర్‌గా ఎదగడానికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఒక్కటే ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్నవారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. గ్రూపు ప్రాజెక్టులు, టీమ్‌ ప్రజెంటేషన్‌లు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. పాఠశాల విద్యతో 21వ శతాబ్దపు నైపుణ్యాలను చేర్చాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న తరుణంలో పిల్లలపై నిర్లక్ష్యం తగదు. విద్య, పాఠశాల ప్రాంగణం, ఉపాధ్యాయులు పిల్లలను భవిష్యత్తులో రాటుదేలేలా తీర్చి దిద్దుతాయి. పిల్లలకు 21వ శతాబ్దపు నైపుణ్య విద్యను అందించడానికి, ఉపాధ్యాయులు విద్యావేత్తల సామర్థ్యాలను కూడా పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయులకు కూడా శిక్షణ అవసరం.

Updated On 25 July 2023 5:32 AM GMT
Ehatv

Ehatv

Next Story