ఐసీయూలో(ICU) రోగులను చేర్చుకోవడంపై కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 24 మంది నిపుణుల బృందం రూపొందించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐసీయూలో చేర్చుకోవాల్సిన రోగులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రోగి నిరాకరిస్తే హాస్పిటల్ యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ బంధువులు(Relative) అభ్యంతరం తెలిపినా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు ఐసీయూలో రోగులను చేర్చుకోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 24 మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది.

ఐసీయూ మార్గదర్శకాల్లోని కీలక పాయింట్లు ఇవే!

ఐసీయూ చికిత్స వద్దనుకునే వారు ‘లివింగ్‌ విల్‌’(Leaving will) ను రాతపూర్వకంగా తెలియజేస్తే ఆ విభాగంలో చేర్చుకోకూడదు.

వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరినవారి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూల్లో ఉంచడంలో ఉపయోగం లేదు.

ఐసీయూ కోసం ఎదురు చూస్తున్న రోగుల రక్త పోటు(BP), శ్వాస రేటు, హృదయ స్పందన(Heart Beat), శ్వాస తీరు(Breathing), ఆక్సిజన్‌ శాచురేషన్‌(Oxygen Saturation), మూత్ర పరిమాణం, నాడీ వ్యవస్థ(Plus Rate) పనితీరు వంటి అంశాలను పరిశీలించి ఐసీయూలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి.

గుండె లేదా శ్వాస కోశ వ్యవస్థ పనితీరులో సమస్యలు ఉన్న రోగులను ఐసీయూల్లో చేర్చుకోవడానికి కారణాలుగా పరిగణించాలి.

తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, అవయవ వైఫల్యం(Diabled), ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడే వారిని ఐసీయూల్లో చేర్చుకోవాలి.

మహమ్మారులు, విపత్తుల సమయంలో వనరుల పరిమితి ఆధారంగా రోగులను ఐసీయూల్లో ఉంచే అంశంపై నిర్ణయం తీసుకోవాలి.

Updated On 3 Jan 2024 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story