విశాల్(Vishal) ఆరోపణలపై స్పందించింది కేంద్ర ప్రభుత్వం(Central Government). విశాల్ సెన్సార్ బోర్డ్(Censor Board) మీద చేసిన ఆరోపణలపై తీవ్రంగా పరిగణించింది. దానిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

Central Govt Reaction On Vishal
విశాల్(Vishal) ఆరోపణలపై స్పందించింది కేంద్ర ప్రభుత్వం(Central Government). విశాల్ సెన్సార్ బోర్డ్(Censor Board) మీద చేసిన ఆరోపణలపై తీవ్రంగా పరిగణించింది. దానిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
సెన్సార్ బోర్డుపై లంచం(bribe) తీసుకున్నారంటూ.. తీవ్రమైన లంచం ఆరోపణలు చేశారు నటుడు విశాల్. ఆయన చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో(Social media) వివరణ ఇస్తూ.. ట్విట్టర్(Twitter) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. విశాల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఆరోపణల పై విచారణ జరిపించబోతున్నట్టు ప్రకటించింది.
సెన్సార్ బోర్డ్‌లో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు రావడం బాధాకరమని, అవినీతి జరిగితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేసింది ప్రభుత్వం. . ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు ఉంటాయని పేర్కొంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి సోషల్ మీడియాలో తెలిపారు. దీనిపై ప్రత్యేకంగా ట్వీట్ కూడా చేశారు.
మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ సెన్సార్ విషయంలో లంచం తీసుకున్నట్టు సభ్యులపై ఆరోపణలు చేశారు విశాల్. ఈసినిమా సెన్సార్ కోసం 6.5 లక్షలు లంచం ఇవ్వవలసి వచ్చిందని విశాల్ గురువారం ట్వీట్ చేశారు. స్క్రీనింగ్ కోసం 3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం 3 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. మరోదారి లేక తాను డబ్బులు ఇవ్వవలసి వచ్చిందని, తాను ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. అంతే కాదు తాను ఎవరెవరికి డబ్బులు పంపించారో ఆ వివరాలను కూడా వెల్లడిస్తూ ప్రధాని మోదీ, మహా సీఎం షిండేలను ట్యాగ్ చేశారు. దాంతో ఈ విషయంలో కేంద్ర సమాచార శాఖ సీరియస్‌గా తీసుకుని పై విధంగా స్పందించారు.
