కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రభుత్వ సంబంధిత గుర్తింపు సేవలకు ఆధార్ కార్డు ని ప్రధానంగా మార్చింది కేంద్ర ప్రభుత్వం .
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రభుత్వ సంబంధిత గుర్తింపు సేవలకు ఆధార్‌కార్డు ని ప్రధానంగా మార్చింది కేంద్ర ప్రభుత్వం . ఆధార్ అన్ని వేళల గుర్తింపుగా మాత్రమే కాకుండా ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విధానం లో ఎంతో అవసరం కూడా ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆధార్‌తో పాన్‌కార్డు కూడా జతచేయపడి ఉండాలి అని సూచింది. ఈ విషయంలో ఇప్పటికే ఎన్నోసార్లు గడువు తేదీలను నిర్ణయించిన ఈ విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది. తాజాగా కేంద్రం మార్చి నెలాఖరులోపు పాన్‌కార్డును ఆధార్‌తో జత చేయకపోతే పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందని ముందుగానే తెలిపింది. అంటే ఇక మీ పాన్‌కార్డు తో మీరు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరు . సదరు బ్యాంకులు కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించారు. బ్యాంకు అకౌంట్ కి ఆధార్ తప్పని సరిఆధార్ కి పాన్‌కార్డు లింక్ తప్పనిసరి మీ బ్యాంకుకి సంబందించిన అకౌంట్ కి ఆధార్ పాన్ జత చేసి లేనట్లు సమాచారం ఉంటే కనుక మీ పాన్ కార్డు నిరుపయోగం చెంది బ్యాంకు లావదేవిల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి . కాబట్టి ఈ నెలాఖరు లోపు మీ పాన్ కార్డు ఆధార్ తో జత చేయాల్సి ఉంటుంది .
కేంద్రం ఇప్పుడు దేశ ప్రజల ప్రయోజనాలు దృష్టి లో ఉంచుకొని మరో సరికొత్త విధానాన్ని అమలులోకి త్వరలో తీసుకురానుంది . పాన్‌కార్డు ,ఆధార్ కార్డు ,డ్రైవింగ్ లైసెన్స్ ,ఓటర్ కార్డు ఇవన్నీ ప్రతిఒక్కరు దగ్గర ఉండేవే. కానీ ఉద్యగులు ,కార్మికులు,వలసలు వెళ్లే వాళ్ళు,ఇలాంటి వారికీ ఒక్కో కార్డులో ఒక్కో చోట అడ్రెస్స్ లు నమోదు చేయబడతాయి . కొన్నిసార్లు కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది . అలంటి అప్పుడు మార్పులు ఎక్కడ చేసుకోవాలో ఏంటో అని చాల మంది తెలియక ఇబ్బందులు పడతారు .పైగా ఒక్కో డిపార్ట్మెంట్ కి వేరువేరు గా సంప్రదించాల్సిన పని ఉంటుంది. ఇప్పుడు ఎవరికీ ఇలాంటి ఇబ్బంది రాకుండా ఆధార్,ఓటర్,డ్రైవింగ్ లైసెన్స్,పాన్ కార్డు ఇలాంటి వాటిలో మన వివరాల్లో ఏమైనా మార్పులు జరపాలంటే అన్ని ఒకే చోట చేసుకొనే వీలును త్వరలో కల్పించబోతుంది ప్రభుత్వం .
ఈ కొత్త సిస్టమ్ డెవలప్‌మెంట్ కోసం ట్రాన్స్‌పోర్ట్, రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీ రాజ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి వాటిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మీ ఆధార్ లో ఏదైనా మార్పుల కోసం మీరు అప్డేట్ చేయాల్సిన పని ఉంటె ఆటోమేటిక్ గా ఇతర డాకుమెంట్స్అయిన పాన్ ,ఓటర్,డ్రైవింగ్ లైసెన్స్ లో కూడా ఈ అప్డేట్ అవుతాయి . మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపొందించే ఈ కొత్త విధానం గురించి డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు వంటి కీలకమైన పత్రాలను జారీ చేసే డిపార్ట్‌మెంట్లతో చర్చించనుంది. ఈవిధానం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మారబోతుంది .