AP Mining Department : మైనింగ్‌లో ఆంధ్రప్రదేశ్ సూపర్
ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖలో(AP Mining Department) భారీ ఎత్తున అవినీతి జరిగిందని, తమకు అనుకూలమైనవాళ్లకే గనులను దోచిపెడుతున్నారని టీడీపీ(TDP) భజన చేసే మీడియా(Media) రాస్తూ వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ రంగంలో అద్భుతంగా పని చేస్తున్నదంటూ కేంద్ర ప్రభుత్వం ఓ అవార్డు కూడా ప్రకటించింది. మొత్తం దేశంలోని 28 రాష్ట్రాలలో మైనింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడో స్థానం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖలో(AP Mining Department) భారీ ఎత్తున అవినీతి జరిగిందని, తమకు అనుకూలమైనవాళ్లకే గనులను దోచిపెడుతున్నారని టీడీపీ(TDP) భజన చేసే మీడియా(Media) రాస్తూ వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ రంగంలో అద్భుతంగా పని చేస్తున్నదంటూ కేంద్ర ప్రభుత్వం ఓ అవార్డు కూడా ప్రకటించింది. మొత్తం దేశంలోని 28 రాష్ట్రాలలో మైనింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడో స్థానం వచ్చింది. నరేంద్రమోదీ(Narendra Modi) సారథ్యంలోని బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత 2015లో మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టానికి కొన్ని సవరణలు కూడా చేశారు. ఈ సవరణల ప్రకారం మేజర్ మినరల్ బ్లాకులకు రాష్ట్ర ప్రభుత్వం వేలం నిర్వహించింది. 2022-2023 సంవత్సరానికి సంబంధించి 11 మేజర్ మినరల్ బ్లాక్స్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలాన్ని నిర్వహించి ఎల్‌ఓఐ(LOI) జారీ చేసింది. తద్వారా మైనింగ్‌లో మూడో స్థానం సంపాదించింది. ఏపీకి సంబంధించిన మైనింగ్ పాలసీ, మైనింగ్ విధానాల కారణంగా ఈ అవార్డు సాధ్యమయ్యిందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.