బీహార్(Bihar)కు ప్రత్యేక హోదా(Special satus) ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.
బీహార్(Bihar)కు ప్రత్యేక హోదా(Special satus) ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో(NDA alliance) ఉన్న జేడీయూ(JDU) బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే! హోదా అన్న ఇవ్వాలి లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ(special economic pacakge) అయినా ప్రకటించాలని జేడీయూ చేసిన డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని డైరెక్ట్‌గా చెప్పేసింది. ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్‌తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా..? అంటూ జేడీయూ ఎంపీ రామ్‌ప్రిత్ మండల్(Ram preet Mandal) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను అడిగారు. దీనికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. దాంతో జేడీయూ సపోర్ట్ అనివార్యమయ్యింది. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో టీడీపీ (16) తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దాంతో ఇటీవల ప్రత్యేక హోదా ప్రతిపాదనను తీసుకొచ్చింది. హోదా ఇవ్వడంలో కేంద్రానికి ఏదైనా సమస్య ఉంటే.. తాము ప్రత్యేక ప్యాకేజీని కోరతామని జేడీయూ ఎంపీ అన్నారు. కేంద్ర ప్రకటన తర్వాత ఆర్జేడీ రియాక్టయ్యింది. కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయిన జేడీయూ ఇక ప్రత్యేక హోదా నాటకాలు కట్టిపెడితే మంచిదని సెటైర్లు వేసింది.