కొన్నాళ్లుగా అల్లర్లతో అట్టుడుకుతోన్న మణిపూర్‌లో(Manipur) అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలను(Women) కొందరు నగ్నంగా(Nude) ఊరేగిస్తునన వీడియో సోషల్ మీడియాలో(social media) వైరల్ అయ్యింది. ఆ మహిళలను ఇష్టానుసారం తాకుతూ ఊరేగించిన వీడియో ట్విట్టర్‌ను కుదిపేసింది. వారిపై సామూహిక అత్యాచారం జరిగిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారు.
కొన్నాళ్లుగా అల్లర్లతో అట్టుడుకుతోన్న మణిపూర్‌లో(Manipur) అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలను(Women) కొందరు నగ్నంగా(Nude) ఊరేగిస్తునన వీడియో సోషల్ మీడియాలో(social media) వైరల్ అయ్యింది. ఆ మహిళలను ఇష్టానుసారం తాకుతూ ఊరేగించిన వీడియో ట్విట్టర్‌ను కుదిపేసింది. వారిపై సామూహిక అత్యాచారం జరిగిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనతో దేశం భగ్గుమంది. ప్రతి ఒక్కరు చలించిపోయారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను తొలగించాలని ట్విట్టర్‌ను కేంద్రం ఆదేశించింది. శాంతిభద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా వీడియోను తొలగించాలని ట్విట్టర్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది.
భారత చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విటర్‌పై(Twitter) చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమవుతోందని సమాచారం. ఇదిలా ఉంటే మణిపూర్‌లో మహిళలపై అమానవీయ ఘటనను సుప్రీంకోర్టు(Supreme court) సుమోటోగా తీసుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను ప్రశ్నించింది. బయటకు వచ్చిన వీడియో వల్ల ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.
మరోవైపు, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నామన్నారు. మే 4న ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం ఈ వీడియో వైరల్ అయ్యింది.