Dasara Celebrations Date : నవమి రోజున దశమి ఎలా జరుపుకోవడం?
పండుగ వస్తుందంటే చాలు.. అది ఎప్పుడు జరుపుకోవాలన్న సంశయం వచ్చిపడుతోంది. దాదాపు ప్రతి పర్వదినానికి ఇది తప్పడం లేదు. ఒకరు ఓ రోజున జరుపుకోవాలని చెబితే, మరొకరు మరో రోజు చేసుకోవాలంటాడు. అసలు పండుగ తిథిని సరిగ్గా ఇదేనని పండితులు కూడా చెప్పలేకపోతున్నారు. వారు కూడా తలో రకంగా చెప్పేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. మొన్న వినాయకచవితి సందర్భంగా కూడా జనాలలో సందిగ్ధత చోటు చేసుకుంది.
పండుగ వస్తుందంటే చాలు.. అది ఎప్పుడు జరుపుకోవాలన్న సంశయం వచ్చిపడుతోంది. దాదాపు ప్రతి పర్వదినానికి ఇది తప్పడం లేదు. ఒకరు ఓ రోజున జరుపుకోవాలని చెబితే, మరొకరు మరో రోజు చేసుకోవాలంటాడు. అసలు పండుగ తిథిని సరిగ్గా ఇదేనని పండితులు కూడా చెప్పలేకపోతున్నారు. వారు కూడా తలో రకంగా చెప్పేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. మొన్న వినాయకచవితి సందర్భంగా కూడా జనాలలో సందిగ్ధత చోటు చేసుకుంది. ఇప్పుడు రానున్న విజయదశమి(Vijaya Dashami) పండుగను కూడా ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై సందేహాలు వస్తున్నాయి. తెలంగాణ విద్వత్సభ మాత్ర అక్టోబర్ 23వ తేదీనే దసరా జరుపుకోవాలని చెబుతోంది. 23న అపరహ్ణం, సూర్యాస్తయ కాలంలో శ్రవణా నక్షత్ర యుక్త దశమి తిథి వ్యాప్తి ఉన్న కారణంగా ఆ రోజునే పండుగ జరుపుకోవడం ఉత్తమమని చెబుతోంది. మామూలుగా ప్రజలు సూర్యదోయం వేళ ఏ తిథి ఉంటే దాన్ని పాటిస్తారు. లేదా రోజులు ఎక్కువ భాగం ఏ తిథి వ్యాప్తి ఉంటుందో దాన్ని పాటించడం ఆనవాయితీ. కానీ తెలంగాణ విద్వత్సభ మాత్రం శ్రవణా నక్షత్ర యుక్త దశమి 23వ తేదీన ఉంటుంది కాబట్టి ఆ రోజున దసరా(Dasara) జరుపుకోవడం శ్రేష్టమని అంటోంది. కాని ఆ రోజు నవమి.. సాయంత్రం వరకు నవమి(Navami) తిథి వ్యాప్తిలో ఉంటుది. మరి రోజులో అధికభాగం నవమి తిథి వ్యాప్తి ఉన్నప్పుడు ఆ రోజున దశమి ఎలా జరుపుకుంటాం? ఇప్పుడు సందేహం చాలా మందికి వస్తున్నది.
23వ తేదీన నవమి తిథి వ్యాప్తి అధికంగా ఉంది కాబట్టి ఆ రోజునే సద్దుల బతుకమ్మను కూడా జరుపుకోవాలా? అంటే సద్దుల బతుకమ్మ, దసరా ఒకే రోజున చేసుకోవాలా? అది శాస్త్రోక్తమేనా? అలా జరుపుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదేమిటంటే 23వ తేదీన మహార్నవమిని, 24వ తేదీన విజయదశమిని జరుపుకోవాలని..! పండుగలకు కేంద్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? కేంద్రానికి ఏమి తెలుసు? అంటే కేంద్ర వాతావరణశాఖలోనే ఆస్ట్రానమీ(astronomy) విభాగం కూడా ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal nehru) ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు. గ్రహగతులను లెక్కవేసి ఏ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో, ఏ తిథి ఎప్పుడు వస్తుందో ఆ విభాగం చెబుతుంటుంది. పండుగల విషయంలో ఉన్న సంక్లిష్టతలను , సందేహాలను తీరుస్తూ వస్తున్నది. దేశం మొత్తానికి ఇదే వర్తిస్తుంది. అందరూ దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆస్ట్రానమీ విభాగం చెబుతున్నదాని ప్రకారం 23వ తేదీ ఉదయం నవమి ఉంటుంది. 24వ తేదీ ఉదయం దశమి ఉంటుంది. పండుగంటే అభ్యంగన స్నానాలు, కొత్త బట్టలు, శమీ వృక్షపూజలు, గుళ్లు గోపురాల సందర్శనలు, పండుగ భోజనాలు .. ఇవన్నీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటాయి. మరి 23వ తేదీన పండుగ జరుపుకోవాలంటే ఆ రోజు ఉండేదే నవమి కదా! నవమి రోజున దశమి ఎలా జరుపుకోవడం? దశమి తిథి వ్యాప్తి ఎక్కువగా ఉన్న 24వ తేదీని వదిలేసి 23న పండుగ జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ ఎలా చెబుతున్నది? ఈ సందేహాలు ఎవరు తీరుస్తారు?