National Turmeric Board : తెలంగాణలో పసుపుబోర్డుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం...గిరిజన యూనివర్సిటీకి కూడా...!
త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం కొన్ని ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని 300 రూపాయలకు పెంచింది.
త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం కొన్ని ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని 300 రూపాయలకు పెంచింది. అలాగే తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు(Turmeric board) ఏర్పాటుతో పాటు సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను తేల్చాలని KWDT-2 ట్రిబ్యునల్‌ను ఆదేశించిది. ఉజ్వల పథకం కింద పేదలకు ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రస్తుతం కేంద్ర 200 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఇప్పుడు దాన్ని 300 రూపాయలకు పెంచింది. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర 903 రూపాయలు ఉంటే, ఉజ్వల లబ్ధిదారులకు 703 రూపాయలకు లభిస్తున్నది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇక ముందు 603 రూపాయలకే సిలిండర్ లభిస్తుంది.