ఇథనాల్‌(Ethonal) తయారీపై కేంద్రం ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. చెరుకు రసంతో ఇథనాల్‌ ఉత్పత్తి కోసం బీ-హెవీ(B-Heavy), మొలాసిస్‌ను(Molasses) ఉపయోగించుకునేందుకు కేంద్రం చక్కెర పరిశ్రమలకు(Suga Industries) అనుమితిచ్చింది. దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను నియంత్రించేందుకు ఇథనాల్‌ తయారీకి చెరుకు(Sugar cane) రసం వాడకాన్ని నిషేధిస్తూ డిసెంబర్ 7న కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇథనాల్‌(Ethonal) తయారీపై కేంద్రం ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. చెరుకు రసంతో ఇథనాల్‌ ఉత్పత్తి కోసం బీ-హెవీ(B-Heavy), మొలాసిస్‌ను(Molasses) ఉపయోగించుకునేందుకు కేంద్రం చక్కెర పరిశ్రమలకు(Suga Industries) అనుమితిచ్చింది. దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను నియంత్రించేందుకు ఇథనాల్‌ తయారీకి చెరుకు(Sugar cane) రసం వాడకాన్ని నిషేధిస్తూ డిసెంబర్ 7న కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ వ్యాపార వేత్తల నుంచి వచ్చిన వినతుల మేరకు కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆహారశాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇథనాల్‌ తయారీకి ఉపయోగించాల్సిన చెరుకు రసం, బీ-హెవీ మొలాసిస్‌ నిష్పత్తిని ఉపయోగించుకునేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది చెరుకు రసాన్ని వాడుకొని ఇథనాల్‌ తయారీని ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు. చెరుకు రసం నుంచి ఇథనాల్ తయారీ ఉత్పత్తిని నిలిపివేసే సమయానికే.. సుమారు 6 లక్షల టన్నుల మేర ఇథనాల్ తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో అటు వ్యాపార వర్గాలు, చెరుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated On 16 Dec 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story