కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) రాజ్యసభ ఎన్నికలకు(Rajya Sabha Elections) సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలాఖరుకు ఖాళీ అయ్యే 56 సీట్లకు ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొంది.

Rajya Sabha Election
కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) రాజ్యసభ ఎన్నికలకు(Rajya Sabha Elections) సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలాఖరుకు ఖాళీ అయ్యే 56 సీట్లకు ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ నెలఖారుకు 56 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నట్లు తెలిపింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) నుంచి 10 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 8న నోటిఫికేషన్Notification) విడుదల కానుంది. ఫిబ్రవరి 15 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా.. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నట్లు పేర్కొంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా జరగనున్నట్లు వెల్లడించింది.
