సాంసంగ్ స్మార్ట్ ఫోన్(Samsung Smart Phones) వినియోగదారులకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన సాంసంగ్ గెలాక్సీ(Samsung Galaxy) ఫోన్‎లలో సెక్యూరిటీ లోపాలన్ని గుర్తించినట్టు తెలిపింది. వాటి వినియోగదారులు వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ(Central Cyber Security  Agency) ఏజెన్సీ సూచించింది.

ముఖ్యంగా ఆండ్రాయిడ్ 11, 12, 12, 14 ఓఎస్ఈ పనిచేసే సాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2023 ఫిబ్రవరిలో భారత్‌లో విడులైన ఆ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్‌ సాంసంగ్ గెలాక్సీ ఎస్‌23(Samsung galaxy s23) సైతం హ్యాకర్లు డేటాను తస్కరించే ఫోన్‌ల జాబితాలో ఉంది.

నాక్స్ ఫీచర్లపై(Features of Knox) కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్(Facial Recognisation) సాఫ్ట్‎వేర్ లో లోపాలు, ఏఆర్ ఎమోజీ యాప్‎లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‎వేర్‎లో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని సెర్ట్-ఇన్ తెలిపింది. కాబట్టి వెంటనే తమ స్మార్ట్ ఫోన్లను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన సెర్ట్ ఇన్ (CERT-In) సూచించింది.

ఇక ముందు కూడా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే నిత్యం ఫోన్ అప్డేట్ చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. గుర్తు తెలీని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని చెబుతున్నారు.

Updated On 15 Dec 2023 1:11 AM GMT
Ehatv

Ehatv

Next Story