మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమిలో చీలిక వచ్చేలా కనిపిస్తోంది. ఎన్సీపీలో(NCP) చీలిక.. కూటమికి కూడ అనుకూలించేలా లేదు. రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajith Pawar) మేనమామ శరద్ పవార్(Sharad Pawar), ఆయన కుమార్తె సుప్రియా సూలేలను(Supriya Suley) కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం.

BJP Offer To Sharad Pawar
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమిలో చీలిక వచ్చేలా కనిపిస్తోంది. ఎన్సీపీలో(NCP) చీలిక.. కూటమికి కూడ అనుకూలించేలా లేదు. రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajith Pawar) మేనమామ శరద్ పవార్(Sharad Pawar), ఆయన కుమార్తె సుప్రియా సూలేలను(Supriya Suley) కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహాగానాల పర్వం మరింత జోరందుకుంది.
కేంద్ర మంత్రివర్గంలో చేరే ప్రతిపాదనపై జరుగుతున్న చర్చలపై సుప్రియా సూలే స్పందించారు. మంత్రివర్గంలో చేరాలని నాకు ఎవరూ ఆఫర్ ఇవ్వలేదని.. దానిపై చర్చించలేదని సుప్రియా సూలే అన్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారో తెలియడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లికార్జున్ ఖర్గే(Malikarjun Kharge), గౌరవ్ గొగోయ్‌లతో నేను నిరంతరం టచ్‌లో ఉన్నాను. అయితే.. మహారాష్ట్రలోని ఏ కాంగ్రెస్ నేతలతోనూ నేను టచ్‌లో లేనని అన్నారు.
అజిత్ పవార్ ద్వారా బీజేపీ.. శరద్ పవార్‌కు మంత్రివర్గంలో చేరాలనే ఆఫర్ ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు.
ఈ ఊహాగానాలకు సంబంధించి శివసేన (ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ కూడా అజిత్ పవార్‌ను టార్గెట్ చేశాడు. అజిత్ పవార్.. శరద్ పవార్‌కు ఇచ్చేంత పెద్ద నాయకుడు కాదని సంజయ్ రౌత్ అన్నారు. అజిత్ పవార్‌ను శరద్ పవార్ తయారు చేశారని అన్నారు. శరద్ పవార్ ని అజిత్ పవార్ చేయలేదన్నారు. శరద్ పవార్ స్థాయి, స్థానం చాలా పెద్దదని కౌంటర్ ఇచ్చారు.
