భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) 394వ జయంతి నేడు. ఈ యోధుడి జయంతిని భారత్లో వేడుకగా జరుపుకుంటుంటారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో పండగలాగా జరుపుకుంటారు. మంచి వ్యూహకర్తగా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మొఘలులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. 1674లో శివాజీకి చక్రవర్తీగా పట్టాభిషకం జరిగింది.

Chhatrapati Shivaji
భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) 394వ జయంతి నేడు. ఈ యోధుడి జయంతిని భారత్లో వేడుకగా జరుపుకుంటుంటారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో పండగలాగా జరుపుకుంటారు. మంచి వ్యూహకర్తగా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మొఘలులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. 1674లో శివాజీకి చక్రవర్తీగా పట్టాభిషకం జరిగింది. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్షం తదియ నాడు పుణె(Pune) జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ(Shahaji), జిజియాబాయి(Jijiabai) దంపతులకు జన్మించారు. శివాజీకి బాల్యంలో మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా తల్లి విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాథలు చెప్పి వీరత్వం రగిల్చింది. వీరు మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశానికి చెందిన ఆడ పడుచు. ఓటమి తప్పదనిపిస్తే, యుద్ధం నుండి తప్పుకోవాలి. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారు. ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం. పటిష్ఠమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడుకోటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు శివాజీ 50 వేల బలగంతో దక్షిణ రాష్ర్టాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నారు. 27 ఏళ్ల యుద్ధాలలో గడిపి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నిరంతరంగా యుద్ధాల చేస్తున్న సమయంలో మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3వ తేదీన రాయగఢ్ కోటలో మరణించారు.
