జమ్మూకశ్మీర్‌(jammu Kashmir) మాజీ గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌(Sathya paul malik) సహాయకుడి ఇళ్ల‌లో సీబీఐ దాడులు చేసింది. ఇన్సూరెన్స్ స్కాంలో(Insurance Scam) ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యపాల్ మాలిక్ సహాయకుడి ఇళ్లలో సీబీఐ(CBI) సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లోని ఎనిమిది చోట్ల దర్యాప్తు సంస్థ కార్యకలాపాలు నిర్వహించింది.

జమ్మూకశ్మీర్‌(jammu Kashmir) మాజీ గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌(Sathya paul malik) సహాయకుడి ఇళ్ల‌లో సీబీఐ దాడులు చేసింది. ఇన్సూరెన్స్ స్కాంలో(Insurance Scam) ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యపాల్ మాలిక్ సహాయకుడి ఇళ్లలో సీబీఐ(CBI) సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లోని ఎనిమిది చోట్ల దర్యాప్తు సంస్థ కార్యకలాపాలు నిర్వహించింది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. బీమా స్కామ్‌కు సంబంధించి ఏప్రిల్ 28న సత్యపాల్ మాలిక్‌ను సీబీఐ ప్రశ్నించింది. మాలిక్ నివాసంలోనే ఈ విచారణ జరిగింది. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో ఆయన వాంగ్మూలాన్ని సీబీఐ తొలిసారిగా రికార్డ్ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్, జమ్మూ కాశ్మీర్‌లో జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టులు ఇవ్వడానికి తనకు లంచం ఆఫర్ చేశారని సత్యపాల్ మాలిక్ ఆరోపించడం గమనార్హం. మాలిక్ ఆరోపణల నేపథ్యంలో సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఆగస్ట్ 23, 2018, అక్టోబర్ 30, 2019 మధ్య తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేసినట్లు మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ పేర్కొన్నారు.

Updated On 17 May 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story