షీనా బోరా(Heena Bora) హత్య కేసు(Murder Case) ఆధారంగా ఓ డాక్యుమెంటరీ సిరీస్(Documentry series) రూపొందిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్‌కు రెడీగా ఉంది. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)వెబ్ సిరీస్ విడుదలను ఆపాలని ముంబాయి హైకోర్టును కోరింది. ఈమేరకు ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. 'ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్'(The Indrani Mukherjea Story: Buried Truth) పేరుతో రూపొందిస్తున్న ఈ సిరీస్ ఓ హత్య కేసు కథాంశం చుట్టూ తిరుగుతుంది.
షీనా బోరా(Heena Bora) హత్య కేసు(Murder Case) ఆధారంగా ఓ డాక్యుమెంటరీ సిరీస్(Documentry series) రూపొందిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్‌కు రెడీగా ఉంది. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)వెబ్ సిరీస్ విడుదలను ఆపాలని ముంబాయి హైకోర్టును కోరింది. ఈమేరకు ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. 'ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్'(The Indrani Mukherjea Story: Buried Truth) పేరుతో రూపొందిస్తున్న ఈ సిరీస్ ఓ హత్య కేసు కథాంశం చుట్టూ తిరుగుతుంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్‌లో షానీ లెవీ, ఉరాజ్ బహల్ ప్రధాన పాత్రలు పోషించారు. కొద్దిరోజుల క్రితం ఈ సిరీస్ నుంచి ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా పలు సంచలనం సృష్టించింది. మీడియాలో అయితే రోజూ దీనిపై డిబేట్ జరిగింది. త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సీబీఐ కోర్జుకు వెళ్లింది. విచారణ ముగిసే వరకు ఈ వెబ్ సిరీస్‌ను ఆపాలని కోర్టుకు విన్నవించుకుంది. సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రాసిక్యూటర్ సిజె నాండోడ్ ద్వారా కోర్టులో పిటీషన్ వేసింది.
ఫలితంగా నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరికొందరికి ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై ఫిబ్రవరి 20వ తేదీన విచారణ జరగనుంది. ఇంద్రాణీ తన కుమార్తె షీనా బోరాను డ్రైవర్ సహాయంతో హత్య చేసి సాక్ష్యాలను దాచి పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో, ఆమె జైలు జీవితాన్ని చూపిస్తూ ఒక ట్రైలర్ విడుదలయ్యింది. ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా(Sanjiv khanna) కలిసి షీనాను కారులో గొంతుకోసి హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. మొదట షీనాను ఇంద్రాణి చెల్లెలు అన్నారు. తర్వాత కన్నబిడ్డ అని తేల్చారు. సుమారు పదేళ్లు దాటిన ఈ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మరి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందా? లేక సీబీఐ పిటిషన్‌తో ఆగిపోతుందా అన్నది తేలాల్సి ఉంది.