మైనింగ్ వ్యాపారి, రాజకీయ నాయకుడు గాలి జనార్ధన రెడ్డికి(Gali Janardhan Reddy) ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆస్తులు(Assets), ఆయన భార్య గాలి అరుణ లక్ష్మి(Aruna Lakshmi) పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)) కోర్టు మంగళవారం ఆదేశించింది. రూ. 65.05 కోట్ల విలువైన గాలి దంపతులకు చెందిన 124 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మైనింగ్ వ్యాపారి, రాజకీయ నాయకుడు గాలి జనార్ధన రెడ్డికి(Gali Janardhan Reddy) ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆస్తులు(Assets), ఆయన భార్య గాలి అరుణ లక్ష్మి(Aruna Lakshmi) పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)) కోర్టు మంగళవారం ఆదేశించింది. రూ. 65.05 కోట్ల విలువైన గాలి దంపతులకు చెందిన 124 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్ట సవరణ చట్టం కింద 82 ఆస్తులను మాత్రమే జప్తు చేసేందుకు కోర్టు అనుమతించింది. స్వాధీనం చేసుకోనున్న ఆస్తుల్లో 77 జనార్దనరెడ్డికి, 5 ఆయన భార్యకు చెందినవి.
జనార్దనరెడ్డికి చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. మే 10న కర్ణాటకలో(Karnataka) జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు(assembly Elections) ముందు గాలి జనార్ధన రెడ్డి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన గంగావతి నుంచి గెలుపొందగా.. ఆయన భార్య అరుణ బళ్లారి సిటీ స్థానంలో బీజేపీని మూడో స్థానానికి నెట్టారు. ప్రచారం సందర్భంగా గాలి జనార్ధన రెడ్డి మాట్లాడుతూ.. తన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ఐటీ దాడుల గురించి పెద్దగా పట్టించుకోనని పేర్కొన్నారు.