నీట్‌ ఎగ్జామ్‌(Neet Exam) గురించి మొన్న లోక్‌సభలో(Lok sabha) ప్రధానమంత్రి మోదీ(Narendra Modi) మాట్లాడారు కానీ పరిష్కారం ఏమిటో చెప్పలేదాయన! ఇప్పటికీ నీట్‌ పేపర్‌ లీక్‌(Paper Leak) వ్యవహారంపై స్టూడెంట్లు నిరసనలు చేస్తూనే ఉన్నారు.

నీట్‌ ఎగ్జామ్‌(Neet Exam) గురించి మొన్న లోక్‌సభలో(Lok sabha) ప్రధానమంత్రి మోదీ(Narendra Modi) మాట్లాడారు కానీ పరిష్కారం ఏమిటో చెప్పలేదాయన! ఇప్పటికీ నీట్‌ పేపర్‌ లీక్‌(Paper Leak) వ్యవహారంపై స్టూడెంట్లు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఆందోళనలు, ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖ కంప్లయింట్‌తో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పటించారు. సీబీఐ అధికారులు జార్ఖండ్‌లో డాక్టర్ ఎహ్సాన్ ఉల్ హక్, ఇంతియాజ్ ఆలంలను ఇది వరకే అరెస్టు చేశారు. తాజాగా మరో నిందితుడు అమన్‌సింగ్‌ను(aman singh) జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అరెస్టు చేశారు అధికారులు. నీట్‌ పేపర్‌ లీక్‌ మాస్టర్‌ మైండ్‌ సంజీవ్ ముఖియాకు సన్నిహితులపైన చింటూ, ముఖేష్‌ల నుంచి పలు విషయాలను రాబట్టారు సీబీఐ అధికారులు. వారు ఇచ్చిన సమాచారం మేరకే అమన్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంజీవ్‌ ముఖియా మేనల్లుడు రాకీకి అమన్‌సింగ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌. రాకీ బీహార్‌లోని రాంచీలో హోటల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అయిన తర్వాత అన్సర్లను రెడీ చేయడానికి రాకీ సాల్వర్లను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అమన్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు కాబట్టి నీట్‌ పేపర్‌ లీక్‌తో సంబంధమున్న సాల్వర్‌లను, ఇతర నిందితులను గుర్తించవచ్చని సీబీఐ అధికారులు అనుకుంటున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఈ నెల 8వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

Eha Tv

Eha Tv

Next Story