ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేసుకోలేదా..? ఆధార్‌తో(Aadhaar Card) పాన్‌(Pan Card) లింక్‌ చేయాలని అధికారులు చెప్పినా వినలేదా..? అయితే మీ పాన్‌ కార్డ్‌ డీ యాక్టివేట్‌ అయినట్లే. ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేసుకోవాలని గతంలో పలు సార్లు గడువులు పొడిగిస్తూ వచ్చారు. ఆదాయపు పన్నుశాఖ నిబంధనల ప్రకారం ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరైంది.

ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేసుకోలేదా..? ఆధార్‌తో(Aadhaar Card) పాన్‌(Pan Card) లింక్‌ చేయాలని అధికారులు చెప్పినా వినలేదా..? అయితే మీ పాన్‌ కార్డ్‌ డీ యాక్టివేట్‌ అయినట్లే. ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేసుకోవాలని గతంలో పలు సార్లు గడువులు పొడిగిస్తూ వచ్చారు. ఆదాయపు పన్నుశాఖ నిబంధనల ప్రకారం ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరైంది. గడువులోగా ఆధార్‌ను పాన్‌తో లింక్‌(Link) చేయని కారణంగా 11.5 కోట్ల పాన్‌ కార్డులను డీ యాక్టివేట్ చేశారు. దేశంలో 70.24 కోట్ల పాన్‌ కార్డులున్నాయి. అందులో 57.25 కోట్ల మంది ఆధార్‌తో పాన్‌ను అనుసంధానించారు. 12 కోట్ల మంది ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేయలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఈ పాన్‌ కార్డులను డీ యాక్టివేట్‌ చేసినట్లు సీబీడీటీ(CBDT) అధికారులు ప్రకటించారు.

సీబీడీటీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్) అధికారుల వివరాల ప్రకారం ఇప్పటికే ఎన్నో డెడ్‌లైన్‌లు ఇచ్చినా ఆధార్-పాన్‌ లింక్‌ చేసుకోని వారు కోట్లలో ఉన్నారని, వారికి ఎన్నిసార్లు గడువులిచ్చినా మారలేదని వెల్లడించింది. 2017 జులై 1 కంటే ముందు జారీ చేసిన పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం నిర్ణయించడంతో సీబీడీటీ దీనిని అమలు చేసింది. గడువులు పెంచుతూ, పొడిగిస్తూ వచ్చిన సీబీడీటీ చివరగా ఈ ఏడాది జూన్ 30 వరకు గడువు విధించింది.

మరోవైపు సీబీడీటీ మరో అవకాశాన్ని ఇచ్చింది. పాన్‌ కార్డ్‌ డీ యాక్టివేట్‌ అయిన వినియోగదారులకు జరిమానాతో మరో అవకాశం వచ్చింది. 1000/- జరిమానా చెల్లించి తిరిగి తమ పాన్‌ కార్డులను రీ-యాక్టివేట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

అయితే మీ పాన్‌-ఆధార్ లింక్‌ స్టేటస్‌ ఎలా చెక్‌ చేసుకోవచ్చో చూసుకునే అవకాశం ఉంది

ఇందు కోసం అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి
(www.incometax.gov.in/iec/foportal/ )
లెఫ్ట్ సైడ్‌లో ఉన్న హోమ్‌పేజీలో 'లింక్ ఆధార్ స్టేటస్‌' ('Link Aadhar Status')పై క్లిక్ చేయండి
తర్వాత మీ పాన్ నంబర్ & ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.
తర్వాత వ్యూ లింక్‌ ఆధార్‌ స్టేటస్‌( 'View Link Aadhaar Status')పై క్లిక్ చేయండి
అయినా లింక్‌ చేసి ఉండకుంటే తప్పనిసరిగా చేసుకోండి
ఆధార్‌-పాన్‌ లింక్‌ లేకుంటే IT ఫైలింగ్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Updated On 12 Nov 2023 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story