అత్యంత ఖరీదైన కుక్క(Dog) హైదరాబాద్‌కు వచ్చింది. ఇది కాకాసియన్ షెపెర్డ్ (Caucasian Sheperd) జాతి కుక్కను మియాపూర్‌లోని(Miyapur) ఓ పెట్ క్లినిక్‌కు హెల్త్ చెకప్(Health checkup) కోసం తీసుకొచ్చారు. నటుడు, బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్(Sathish) దీనిని రూ.20 కోట్లకు కొనుక్కున్నారు. దీనికి కాడాబామ్ హైడర్(Kadabam Hyder) అనే పేరు కూడా పెట్టారు.
అత్యంత ఖరీదైన కుక్క(Dog) హైదరాబాద్‌కు వచ్చింది. ఇది కాకాసియన్ షెపెర్డ్ (Caucasian Sheperd) జాతి కుక్కను మియాపూర్‌లోని(Miyapur) ఓ పెట్ క్లినిక్‌కు హెల్త్ చెకప్(Health checkup) కోసం తీసుకొచ్చారు. నటుడు, బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్(Sathish) దీనిని రూ.20 కోట్లకు కొనుక్కున్నారు. దీనికి కాడాబామ్ హైడర్(Kadabam Hyder) అనే పేరు కూడా పెట్టారు. అంతేకాదు ఈ కుక్క అంతర్జాతీయస్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని 32 పతకాలు సాధించిందని సతీష్ చెప్పాడు. హైదరాబాద్‌లో జరిగే డాగ్ షో(Dog show) కోసం శునకాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ కుక్క సినిమాల్లో కూడా నటిస్తుందని తెలిపారు. దీనిని చూసేందుకు అక్కడి స్థానికులంతా ఎగబడ్డారు. దీనితో సెల్ఫీలు(Selfis) దిగేందుకు పోటీలు పడ్డారు. కుక్కలను ఎంతగానో ఇష్టపడే సతీష్ గతంలో కూడా పలు కుక్కలను కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. సతీష్ దగ్గర 10 కోట్ల విలువైన టిబెటన్ మస్తీఫ్, మరో రూ.8 కోట్ల అలస్కన్ మాలామ్యూట్, కోటి విలువైన కొరియన్ డోసా ముస్తిఫ్ జాతి కుక్కలున్నాయి. కుక్కలను మహరాజులా చూసుకుంటానని సతీష్ చెప్తున్నారు.