తూర్పు కనుమల్లో(Eastern Ghats) జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందని సీసీఎంబీ(CCMB) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ ఫిష్(Catfish) ఉనికిని కనుగొన్నారు. అక్కడి నీటి వనరుల నుంచి సేకరించిన నమూనాలను ఎన్విరాన్‌మెంటల్ డీఎన్‌ఏ(Environmental DNA) ద్వారా పరిశోధించిన శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసింది.
తూర్పు కనుమల్లో(Eastern Ghats) జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందని సీసీఎంబీ(CCMB) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ ఫిష్(Catfish) ఉనికిని కనుగొన్నారు. అక్కడి నీటి వనరుల నుంచి సేకరించిన నమూనాలను ఎన్విరాన్‌మెంటల్ డీఎన్‌ఏ(Environmental DNA) ద్వారా పరిశోధించిన శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసింది. దీనివల్ల స్థానిక మత్స్యజాతికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఇది ఆందోళన కలిగించే విషయమని పరిశోధకులు అంటున్నారు. స్థానిక మత్స్య సంపద తగ్గిపోతే అది ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. తూర్పు కనుమల్లోని జలచరాలపై సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త నీల్దిప్ గంగూలీ(Neeldeep Ganguly), డాక్టర్ జి.ఉమాపతి బృందం పరిశోధన చేసింది. కొన్నాళ్ల కిందట చెరువులు, ఆక్వేరియంలో ఆల్గే పెరిగేది. దాన్ని శుభ్రపరచడం కోసం క్యాట్‌ఫిష్‌లను వదిలారు. ఇప్పుడు ఆ క్యాట్‌ఫిష్‌లే అన్ని నీటివనరులను ఆక్రమించాయి. తూర్పు కనుమల్లో నీటివనరుల్లోకి కూడా క్యాట్ ఫిష్‌లు చేరాయి. ఆక్రమించాయని చెప్పుకోవచ్చు. అయితే సీసీఎంబీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ-డీఎన్‌ఏ టెక్నిక్ క్యాట్‌ఫిష్‌ను ముందుగానే గుర్తించడంలో సాయపడుతుంది కాబట్టి స్థానిక మత్స్య సంపదకు ప్రమాదం లేకుండా చూడవచ్చు. ఎన్విరాన్‌మెంటల్ డీఎన్‌ఏ విధానం కచ్చితమైనది. పైగా ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న తూర్పు కనుమల వంటి ప్రాంతాలోని నీటి వనరులను కూడా కొన్ని మాసాల్లోనే పరీక్షించవచ్చు అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి చెప్పారు