అందరూ ఊహించినట్టుగానే జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)ను లోక్‌సభ(Lok Sabha) నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సూచించింది. ఆమె చర్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పింది. ఆమె అనైతికంగా వ్యహరించారని, నేరపూరితమైన చర్యలకు పాల్పడ్డారని కామెంట్ చేసింది.
అందరూ ఊహించినట్టుగానే జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)ను లోక్‌సభ(Lok Sabha) నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సూచించింది. ఆమె చర్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పింది. ఆమె అనైతికంగా వ్యహరించారని, నేరపూరితమైన చర్యలకు పాల్పడ్డారని కామెంట్ చేసింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీలతో కూడిన తుది నివేదికను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ రూపొందించింది. చిత్రమేమిటంటే నివేదిక లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించక ముందే అది మీడియాకు లీకవ్వడం. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే మీడియాకు లీకులిచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలపై 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే తనపై దూబే చేసిన ఆరోపణలను మొయిత్రా ఖండించారు. ఇప్పటికే ఎంపీ నిషికాంత్ దూబే, జై అనంత్‌కు లీగల్ నోటీసులు పంపించారు.