ఇండియాకు(India) రావాల్సిన కార్గో షిప్‌(Cargo ship) హైజాక్‌కు(Hijack) గురయ్యింది. వివిధ దేశాలకు చెందిన పాతికమంది సిబ్బంది ఆ నౌకలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తుర్కియే(Turkey) నుంచి ఇండియాకు రావాల్సిన ఆ షిప్‌ను ఎర్రసముద్రంలో యెమెన్‌(Yemen) హౌతీ(Houthi) తిరుగుబాటుదారులు హైజాక్‌ చేశారంటూ ఇజ్రాయెల్‌(Israel) ఆరోపిస్తోంది. ఇరాన్‌(Iran) అధారిన ఉద్రవాదంగా పేర్కొంటోంది.

ఇండియాకు(India) రావాల్సిన కార్గో షిప్‌(Cargo ship) హైజాక్‌కు(Hijack) గురయ్యింది. వివిధ దేశాలకు చెందిన పాతికమంది సిబ్బంది ఆ నౌకలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తుర్కియే(Turkey) నుంచి ఇండియాకు రావాల్సిన ఆ షిప్‌ను ఎర్రసముద్రంలో యెమెన్‌(Yemen) హౌతీ(Houthi) తిరుగుబాటుదారులు హైజాక్‌ చేశారంటూ ఇజ్రాయెల్‌(Israel) ఆరోపిస్తోంది. ఇరాన్‌(Iran) అధారిన ఉద్రవాదంగా పేర్కొంటోంది. మరోవైపు కార్గోషిప్‌ హైజాక్‌కు బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. షిప్‌ను యెమెన్‌ పోర్టుకు తీసుకువచ్చినట్టు చెప్పారు. ఈ షిప్‌ ఇజ్రాయెల్‌కు చెందినదని హౌతీ తిరుగుబాటు దారులు చెబుతుంటే, అది తమ ఓడ కాదని, బ్రిటిష్‌(British) యాజమాన్యంలోని నౌక అని ఇజ్రాయెల్‌ అంటోంది. ప్రస్తుతం ఆ నౌక జపాన్‌ నిర్వహణలో ఉందని తెలిపింది. అందులో ఉన్న పాతిక మంది సిబ్బందిలో ఒక్కరు కూడా ఇజ్రాయెల్‌వారు లేరని స్పష్టం చేసింది. ఉన్నవారంతా ఉక్రెయిన్‌, బల్గేరియా, ఫిలిప్పీన్స్‌, మెక్సకోకు చెందిన వారని పేర్కొంది. ఇజ్రాయెల్‌పై దాడులను ఉధృతం చేస్తామని గతవారం ప్రకటించిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ ఆధారిత ఓడలన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ నౌకల్లో ఇతర పౌరులు పనిచేయకూడదని కూడా హౌతీ తెలిపింది.

Updated On 20 Nov 2023 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story