అగ్ని ప్రమాదంలో(Fire accident) అసువులు బాసిన కెప్టెన్‌ అన్షుమన్‌సింగ్‌(Captain anshuman Singh) తల్లిదండ్రులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారు.

అగ్ని ప్రమాదంలో(Fire accident) అసువులు బాసిన కెప్టెన్‌ అన్షుమన్‌సింగ్‌(Captain anshuman Singh) తల్లిదండ్రులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. తమకు కొడుకు ఫోటో తప్ప ఏమీ మిగలలేదని బాధపడుతున్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు అన్న మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అన్షుమన్‌ సింగ్‌కు ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును( Kirti Chakra Award) ప్రకటించింది. ఇటీవల ఇచ్చిన ఆ అవార్డును తమ కోడలు స్మృతి(smriti) తీసుకెళ్లిందని వాపోయారు. కనీసం కీర్తి చక్ర మెడల్‌ను తాము తానకు కూడా తాకలేదని అన్షుమన్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కోడలితో కలిసి కీర్తి చక్ర అవార్డు తీసుకోవడానికి వెళ్లినపుడు మెడల్‌తో తాను ఒక ఫొటో మాత్రమే తీసుకున్నానని అన్షుమన్‌ తల్లి తెలిపారు. అన్ని అధికారిక పత్రాలలో కోడలు తన అడ్రస్‌ను మార్చుకుందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమైనా ఆమెకు మాత్రమే వెళుతుందని చెప్పారు. ఇండియన్‌ ఆర్మీలో(Indian army) మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేసిన అన్షుమన్‌ సియాచిన్‌లో విధులు నిర్వహించారు. నిరుడు జులైలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో తన సహచరులను కాపాడి మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ధైర్య సాహసాలను ప్రదర్శించినందుకు కేంద్రప్రభుత్వం అన్షుమన్‌కు కీర్తి చక్ర ప్రకటించింది. అశోక చక్ర తర్వాత ఇది రెండో అతి పెద్ద పతకం. ఈ నెల 5వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. అన్షుమన్‌ భార్య స్మృతి, తల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తిచక్ర పతకాన్ని అందించారు.

Updated On 12 July 2024 7:05 AM GMT
Eha Tv

Eha Tv

Next Story