ఢిల్లీ లిక్కర్‌ కేసులో(Delhi Liquor case) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను(CM Kejriwal) ఈడీ(ED) అరెస్ట్ చేసింది. అయితే సీఎం పదవి నిర్వహస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయవచ్చా అని మీకు డౌట్‌ రావొచ్చు. కానీ దర్యాప్తు సంస్థలకు అరెస్ట్ చేసే వెసులుబాటు ఉంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి అవకాశం లేదు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో(Delhi Liquor case) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను(CM Arvind Kejriwal) ఈడీ(ED) అరెస్ట్ చేసింది. అయితే సీఎం పదవి నిర్వహస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయవచ్చా అని మీకు డౌట్‌ రావొచ్చు. కానీ దర్యాప్తు సంస్థలకు అరెస్ట్ చేసే వెసులుబాటు ఉంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి అవకాశం లేదు. ఆర్టికల్‌ 361(Article 361) ప్రకారం రాష్ట్రపతి(President), గవర్నర్లు(Governor) అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ అవకాశం లేదు. చట్టం ముందు అందరూ సమానమే అన్న నియమం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. కావును సీఎంను అరెస్టు చేసేందుకు చట్టపరంగా అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనే కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. నగర వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. ఆప్‌ కార్యకర్తల ఆందోళనలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఈడీ కార్యాలయం, కేజ్రీవాల్ నివాసానికి వెళ్లే అన్ని మార్గాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Updated On 22 March 2024 1:02 AM GMT
Ehatv

Ehatv

Next Story