2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ పొత్తు పెట్టుకోబోతున్నాయా? అనే ప్రశ్న గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ పొత్తు పెట్టుకోబోతున్నాయా? అనే ప్రశ్న గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బుధవారం ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ఒడిశా యూనిట్ బీజేపీ నేతలు భేటీ కాగా.. అదే రోజు సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో బీజేడీ నేతలు సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఇరు పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

బీజేడీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబీ ప్రసాద్ మిశ్రా బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల ఒడిశా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీలు మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్లు కొన్ని సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి, ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఏమీ మాట్లాడలేదు.. చాలా సందర్భాలలో నవీన్ పట్నాయక్‌ను ప్రశంసించారు.

పొత్తుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే సీట్ల పంపకం విషయంలో రాష్ట్రంలో ఈక్వేషన్ ఎలా ఉంటుందనేది కూడా ప్రశ్న. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య పోరు సాగుతుందా? అనే చ‌ర్చ జ‌రుగుతుంది.

ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేడీకి 12, బీజేపీకి 8, కాంగ్రెస్‌కు ఒక సీటు ఉంది. పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఐదు-ఆరు సీట్లు ఎక్కువ కావాలి.. దానికి బదులుగా అసెంబ్లీలో బీజేడీకి మరికొన్ని సీట్లు ఇచ్చే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి 14 లోక్‌సభ సీట్లు.. బీజేడీకి ఏడు సీట్లు ఇచ్చే వ్య‌వ‌హార‌మై చ‌ర్చ న‌డుస్తోంది. దీనికి ప్రతిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేడీకి 95-97 సీట్లు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి 50-52 సీట్లు మిగులుతాయి. ప్రస్తుతం ఉభయ సభల్లోనూ తమ సంఖ్య ఎక్కువగా ఉన్నందున బీజేడీ పెద్ద వాటాను కోరుకుంటోంది. బీజేడీకి 102కి పైగా అసెంబ్లీ సీట్లు కావాలని అంటున్నారు.

Updated On 6 March 2024 11:34 PM GMT
Yagnik

Yagnik

Next Story