పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఆదేశించింది. 48 గంటల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాల కోసం కేంద్రాన్ని అభ్యర్థించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఆదేశించింది. 48 గంటల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర బలగాల కోసం కేంద్రాన్ని అభ్యర్థించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించడాన్ని వ్య‌తిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్ర పంచాయతీ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. వీరి పిటిషన్లపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం(TS Shivajnana)తో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.

వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం చివరి రోజు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా హింస కొనసాగింది. ఈ హింస ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. దక్షిణ 24 పరగణాల్లో జరిగిన హింసాత్మక ఘటనలో ఇద్దరు మరణించారు. పోలీసులతో సహా 20 మందికి పైగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రుల్లో చేర్చారు. చాలా చోట్ల 144 సెక్షన్ అమలు చేయగా, చాలా చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

నార్త్ దినాజ్‌పూర్‌లో(North DinajPur) నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపై కాల్పులు జరిగాయి. వీరు సీపీఎం, కాంగ్రెస్‌ కార్యకర్తల‌ని చెబుతున్నారు. వీరిలో ఒకరు మృతి చెందారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో కూడా రోజంతా కాల్పులు, షెల్లింగ్‌లు జరిగాయి. ఇక్కడి భాంగర్ 2 బీడీఓ కార్యాలయ ఆవరణ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ దాడిలో ఓ ఐఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందాడు. హింసాకాండలో గాయపడిన ఓ పోలీసు సహా 20 మందికి పైగా ఆసుపత్రుల్లో చేరారు. ఘటన తర్వాత పోలీసు బలగాలను మోహరించారు.

Updated On 16 Jun 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story