ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరగనుంది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఓటింగ్(Voting) జరగనుంది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections).. 2024లో లోక్‌సభ ఎన్నికలు(Loksabha Elections) జరగనున్న నేపథ్యంలో.. ఈ ఉప ఎన్నికలు.. బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి I-N-D-I-A కు మొదటి పరీక్ష కానున్నాయి
I-N-D-I-A కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారి.. ఈ ఎన్నికల ద్వారా బీజేపీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై కూడా పెను ప్రభావం చూపనున్నాయి. ఎన్నికల ఫలితాలను బట్టి అధికార, విపక్షాలు తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, బెంగాల్‌లోని ధూప్‌గురి, కేరళలోని పుటుపల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బక్సానగర్, ధన్‌పూర్‌లో పోలింగ్ జరగనున్న ఏడు అసెంబ్లీ స్థానాలు. మొత్తం ఏడు స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 8న జరగనుంది.