ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బరేలీలో(Bareli) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఫైవ్‌స్టార్‌ హోటల్‌ బిల్డింగ్ టెర్రస్‌ పై నుంచి కిందకు తోసేశాడో వ్యక్తి. బరేలీకి చెందిన ఓ యువకుడు తన పెళ్లి సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చాడు.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బరేలీలో(Bareli) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఫైవ్‌స్టార్‌ హోటల్‌ బిల్డింగ్ టెర్రస్‌ పై నుంచి కిందకు తోసేశాడో వ్యక్తి. బరేలీకి చెందిన ఓ యువకుడు తన పెళ్లి సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఆదివారం తెల్లవారజామున రెండు గంటల సమయంలో ఓ ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం(Drunk) చోటు చేసుకుంది. ఈ ఇద్దరిలో ఒక యువకుడు తన తండ్రికి ఫోన్‌ చేసి పిలిపించాడు. అతను వచ్చి తన కొడుకుతో గొడవపడిన యువకుడిని బాగా కొట్టాడు. తర్వాత హోటల్‌ బిల్డింగ్‌ టెర్రస్‌పై నుంచి కిందకు తోశాడు. మరో యువకుడిని కూడా కిందకు తోసే ప్రయత్నం చేశాడు కానీ ఓ వ్యక్తి అడ్డుకోవడంతో అతడు గండం నుంచి బయటపడ్డాడు. బిల్డింగ్‌ నుంచి కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 22 April 2024 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story