నలుగురు స్నేహితులు కలిసి తమ స్నేహితుడిని చంపి పాతిపెట్టిన ఘటన నోయిడాలో(Noida) వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త దీపక్‌ మిట్టల్‌(deepak mital) కుమారుడు యశ్‌ మిట్టల్‌(Yash Mital) గత సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు. తన కుమారుడిని ఎవరో కిడ్నాప్‌ చేసి రూ.6 కోట్లు డిమాండ్‌ చేశారని దీపక్‌ మిట్టల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యశ్‌ మిట్టల్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా యశ్‌ను స్నేహితులే చంపేశారని తేలింది. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ వ్యాపార వేత్త దీపక్‌ మిట్టల్‌ కుమారుడు నోయిడా యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే సోమవారం నుంచి యశ్‌ కనిపించకుండా పోయాడు. ఓ పార్టీలో ఘర్షణ చోటుచేసుకోగా యశ్‌ను స్నేహితులే చంపి పాతిపెట్టారని తేలంది. హత్యను పక్కదారి పట్టించేందుకు కిడ్నాప్‌ డ్రామాకు నిందితులు తెరలేపారు. మీ కుమారుడిని కిడ్నాప్‌ చేశామని రూ.6 కోట్లు ఇస్తేనే విడిచిపెడతామని దీపక్‌ మిట్టల్‌కు ఫోన్‌ చేశారు. పోలీసులకు దీపక్‌ ఫిర్యాదు చేయంగా రంగంలోకి దిగిన పోలీసులు క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఫోన్‌లో మాట్లాడుతూ సోమవారం క్యాంపస్‌ నుంచి యశ్‌ బయటకు వెళ్తుండడం గమనించారు. యశ్‌ స్నేహితుడు రచిత్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్‌ రికార్డుల ద్వారా గుర్తించారు. యష్ తరచుగా రచిత్, శివమ్, సుశాంత్, శుభమ్‌లతో తిరుగుతుంటాడని పోలీసులకు తెలిసింది. అయితే ఈనెల 26న ఉత్తరప్రదేశ్‌ గజ్రౌలాలోని ఓ ప్రాంతానికి పార్టీ కోసం యశ్‌ను పిలిచారు. ఇది యూనివర్సిటీకి 100 కి.మీ.దూరంలో ఉంది. దీంతో వారు పిలిచిన ప్రదేశానికి యశ్‌ చేరుకున్నాడు. పార్టీ జరుగుతున్న సమయంలో వీరి మధ్య ఘర్షణ చెలరేగి తోపులాట జరిగింది. యశ్‌ను హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టారు. రచిత్‌ మొబైల్‌ లోకేషన్ ట్రేస్‌ చేసి యశ్‌ను పూడ్చిపెట్టిన ప్రాంతాని పోలీసులు వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేశామని మరో నిందితుడు శుభం పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. యశ్‌ కుటుంబాన్ని తప్పుదోవ పట్టించేందుకే కిడ్నాప్‌ డ్రామా ఆడారని నిందితులు పోలీసులకు తెలిపారు.

Updated On 29 Feb 2024 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story