ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన వేరుశనక్కాయలు(Peanuts) కొన్నాడు.

ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన వేరుశనక్కాయలు(Peanuts) కొన్నాడు. డబ్బులు మాత్రం ఇవ్వకుండా సతాయిస్తున్నాడు. మహారాష్ట్రలోని(Maharashtra) షోలాపూర్‌(Sholapur) ప్రాంతంలో ఉంటాడా వ్యాపారి. ఇతడు కొన్నేళ్లుగా పల్లీల వ్యాపారం చేస్తున్నాడు. గద్వాల వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని వ్యాపారుల నుంచి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పెద్ద మొత్తంలో వేరుశనక్కాయలు కొన్నాడు. అంతే అప్పట్నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్‌ చేస్తేనేమో లిఫ్ట్‌ చేయడం లేదు. ఇలాగైతే లాభం లేదనుకుని వ్యాపారులు షోలాపూర్‌కే వెళ్లారు. డబ్బుల కోసం నిలదీశారు. ప్రస్తుతానికి తన దగ్గర డబ్బుల్లేవని, ఉన్నప్పుడు ఇస్తానని చెప్పి వారిని పంపించేశాడు. ఇది జరిగి కూడా నెలలు కావొస్తోంది. ఇప్పటి వరకు పైసా ఇచ్చిన పాపాన పోలేదా వ్యాపారి. రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో సుమారు వంద కోట్ల రూపాయల విలువైన పల్లీలు కొన్నాడట! డబ్బులు మాత్రం ఇవ్వకుండా సతాయిస్తున్నాడట! గద్వాల మార్కెట్‌లో దాదాపు 15 మంది వ్యాపారులకు అయిదు కోట్ల రూపాయల నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. పాపం వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రాజకీయ నాయకులైనా సాయం చేస్తారేమోనని వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story