బ్యూరోక్రాట్స్ ఇండియా(Bureaucrats India) తన 3వ జాబితాను విడుదల చేసింది, '2023కి చెందిన 23 మహిళా బ్యూరోక్రాట్ల(Women bureaucrats) పేర్లను విడుదల చేసింది. 2023లో గణనీయమైన పురోగతిని సాధించిన మహిళా అధికారులు అంటూ జాబితాను విడుదల చేశారు.
బ్యూరోక్రాట్స్ ఇండియా(Bureaucrats India) తన 3వ జాబితాను విడుదల చేసింది, '2023కి చెందిన 23 మహిళా బ్యూరోక్రాట్ల(Women bureaucrats) పేర్లను విడుదల చేసింది. 2023లో గణనీయమైన పురోగతిని సాధించిన మహిళా అధికారులు అంటూ జాబితాను విడుదల చేశారు. ఇందులో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్ఎస్(IFS) అధికారులు ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన ఐఏస్‌లు స్మితా సబర్వాల్(smita sabharwal), కాట ఆమ్రపాలి(Kota Amrapali), పమేలా సత్పతి(Pamela Satpathy) ఉన్నారు. దీంతో ఈ మహిళా అధికారులకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఐఏఎస్, ఐపీఎస్ పదవులు దేశంలో అత్యున్నతమైన పోస్టుల్లో ఇవి కూడా ఉన్నాయి. లక్షలాది మంది ఎంతో కాలం శ్రమించి ఈ పరీక్షకు హాజరవుతారు. కఠోర దీక్ష, బ్యూరోక్రాట్ పదవి కొట్టాలన్న లక్ష్యంతో శ్రమించి వీటిని సాధిస్తారు. అయితే ఇప్పటివరకు పురుషులే అధికంగా ఉండే బ్యూరోక్రాట్లు.. ఇప్పుడు మహిళలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోమన్నట్లు ఈ పదవులను సాధిస్తున్నారు. అంతేకాకుండా సమాజంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఇదే విషయాన్ని బ్యూరోక్రాట్స్ ఆఫ్ ఇండియాతో మూడో జాబితాలో 23 మంది మహిళా అధికారుల పేర్లు ప్రస్తావించింది. ఇందులో ఒక్క తెలంగాణ నుంచే ముగ్గురు అధికారులు ఉన్నారు. దీనిపై స్మితా సబర్వాల్ స్పందించారు. బ్యూరోక్రాట్స్ ఆఫ్ ఇండియా ట్వీట్‌ను ఆమె రీట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల ప్రశంసలు వీరికి దక్కుతున్నాయి. మీ సేవలకు హ్యాట్సాఫ్, సెల్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.