ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద పడి ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారని అధికారులు భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్(Utter Pradesh)లోని బారాబంకి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద పడి ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి 12 మందిని రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
బారాబంకిలోని ఫతేపూర్(Pathepur) పట్టణంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడంతస్తుల ఇల్లు కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి పరిసరాల్లో దాదాపు 12 మంది నిద్రిస్తున్నారు. ప్రమాదం తర్వాత.. ఎస్పీ దినేష్ కుమార్ సింగ్(SP Dinesh Kumar Singh), CDO ఏక్తా సింగ్(Ektha Singh), ADM అరుణ్ కుమార్ సింగ్(Arun Kumar Singh) సమక్షంలో పోలీసులు, SDRF సిబ్బంది, స్థానిక ప్రజలు సహాయక చర్యలు ప్రారంభించారు.
12 మందిని జిల్లా ఆసుపత్రికి పంపారు. అక్కడ వైద్యులు ఇద్దరు చనిపోయినట్లు ప్రకటించారు. ఎనిమిది మందిని లక్నోకు రెఫర్ చేశారు. శిథిలాల కింద మరో ముగ్గురు చిక్కుకునే అవకాశం ఉందని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని కూడా రప్పించారు.
ఫతేపూర్ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న మొహల్లా కాజీపూర్ వార్డు 2లో హషీమ్ అనే వ్యక్తికి చెందిన మూడంతస్తుల ఇల్లు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పూర్తిగా కూలిపోయింది. ఆకస్మిక ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే.. పోలీసు బలగాలతో పాటు అధికారులందరూ, పలు పోలీసు స్టేషన్ల SDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.