ప్రపంచ మానవాళి దు:ఖానికి కారణం కనుగొన్న బుద్ధుడు(Budha) నడయాడిన దేశం మనది! నాలుగు ఆర్య సత్యాలను బోధించిన గౌతముడి పాదస్పర్శతో పావనమైన దేశం మనది! బౌద్ధమత వృక్షం పల్లవించిన పవిత్ర ప్రదేశం మనది! ఇవాళ ఆ తథాగతుడి జయంతి..

ప్రపంచ మానవాళి దు:ఖానికి కారణం కనుగొన్న బుద్ధుడు(Buddha) నడయాడిన దేశం మనది! నాలుగు ఆర్య సత్యాలను బోధించిన గౌతముడి పాదస్పర్శతో పావనమైన దేశం మనది! బౌద్ధమత వృక్షం పల్లవించిన పవిత్ర ప్రదేశం మనది! ఇవాళ ఆ తథాగతుడి జయంతి.. ఈ రోజును బుద్ధ పూర్ణిమగా మనం వేడుకలు జరుపుకుంటాం! మానవాళికి ఓ మార్గనిర్దేశం చేసిన బుద్ధ భగవానుడు జన్మించిన రోజది! అహింసో పరమోధర్మ అని చాటి చెప్పిన మహనీయుడు..

మహాబోధి నీడలోన మహిమ గనిన గౌతముడు(Gautham) ఆయన! అన్ని దేశాల్లో అందరిలో ప్రసిద్ధుడాయన! వైశాఖ శుద్ధపూర్ణిమ రోజున లుంబినిలో బద్ధభగవానుడు జన్మించాడని అంటారు. ఆయన మహాబోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందింది క్రీస్తుపూర్వం 588లో. గౌతముడికి జ్ఞానోదయం అయిన రోజు, బుద్ధగయలో ఆయన నిర్వాణం, కుషి నగరంలో ఆయన పరినిర్వాణం జరిగిన సందర్భాలను పురస్కరించుకుని కూడా బౌద్ధ పౌర్ణిమను పాటిస్తారు కొందరు.

బుద్ధపూర్ణిమను(Buddhapurnima) వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుచుకుంటారు. పేర్లు ఎలా ఉన్నా ఈ పవిత్రమైన రోజున బౌద్ధులంతా ప్రశాంత మనసుతో ఆ తథాగతుడి బోధనలు తల్చుకుంటారు.. బౌద్ధ ఆరామాలను సందర్శిస్తారు. బౌద్ధ భిక్షువులకు అన్నపానీయాలను అందచేస్తారు. బుద్ధుడి విగ్రహాల ముందు దీపాలు, అగరొత్తులు వెలిగిస్తారు. పూలమాలలు సమర్పిస్తారు. పళ్లను నైవేద్యంగా అర్పిస్తారు.

నేపాల్‌లో స్వన్యపున్హిగా, సింగపూర్‌లో వెసాక్‌గా, ఇండోనేషియాలో హరివైసాక్‌గా, థాయ్‌లాండ్‌లో విశాక్‌బుచ్చగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. ఇక్కడే కాదు, బౌద్ధులు ఉన్న ఆగ్నేయాసియా దేశాల్లో వైశాఖ పూర్ణిమను ఘనంగా జరుపుకుంటారు. శ్రీలంక, వియత్నాం, టిబెట్‌, మయన్మార్‌, భూటాన్‌, కొరియా, చైనా, కంబోడియా, జపాన్‌ దేశాల్లోనూ బుద్ధ పూర్ణిమ వేడుకలు జరుగుతాయి.

బుద్ధ పూర్ణిమ రోజున ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం బుద్ధ గయ భక్తులతో కిక్కిరిసిపోతుంది. మహాబోధి వృక్షాన్ని సందర్శించడానికి పెద్ద పెట్టున వస్తారు. బుద్ధ గయలోనే 80 అడుగుల ఎత్తయిన బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర నుంచి పెద్ద ఊరేగింపు మొదలువుతుంది. రంగురంగుల పతకాలతో మహాబోధి ప్రాంగణం కళకళలాడుతుంటుంది. వారణాసి దగ్గర ఉన్న సార్‌నాథ్‌ కూ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమే! ఇక్కడే బుద్ధుడు తన మొదటి బోధను వినిపించాడు.

థాయ్‌లాండ్‌(Thai land), టిబెట్‌(Tibet), భూటాన్‌ల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షవులు ఇక్కడికి వస్తారు. బుద్ధుడి ఆశీస్సులను తీసుకుంటారు. ఒడిషాలోని ధవళగిరిలో కూడా బౌద్ధ పౌర్ణిమ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బుద్ధ పూర్ణిమ రోజున బౌద్ధులు నియమనిష్టలతో ఉంటారు. పూర్తిగా శాకాహారమే తీసుకుంటారు. పాలు, పంచదార, బియ్యంతో చేసిన పరమాన్నం వండి బుద్ధుడికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. వీలైనంత వరకు తెల్లటి దుస్తులను ధరిస్తారు. రెండు రోజుల ముందే ఇంటిని శుభ్రం చేస్తారు. విద్యుద్దీపాలతో ఇంటిని అలంకరిస్తారు.

Updated On 5 May 2023 2:07 AM GMT
Ehatv

Ehatv

Next Story