Goutham Budha : బుద్ధుడి పాదస్పర్శతో పావనమైన దేశం మనది!
ప్రపంచ మానవాళి దు:ఖానికి కారణం కనుగొన్న బుద్ధుడు(Goutham Budha) నడయాడిన దేశం మనది! నాలుగు ఆర్య సత్యాలను బోధించిన గౌతముడి పాదస్పర్శతో పావనమైన దేశం మనది! బౌద్ధమత వృక్షం పల్లవించిన పవిత్ర ప్రదేశం మనది! ఈ పున్నమే ఆ తథాగతుడి జయంతి. ప్రపంచమంతా బుద్ధ పూర్ణిమగా(Budha Purnima) వేడుకలు జరుపుకుంటున్నది.. మానవాళికి ఓ మార్గనిర్దేశం చేసిన బుద్ధ భగవానుడు జన్మించిన రోజది! అహింసో పరమోధర్మ అని చాటి చెప్పిన మహనీయుడు.

Goutham Budha
ప్రపంచ మానవాళి దు:ఖానికి కారణం కనుగొన్న బుద్ధుడు(Goutham Budha) నడయాడిన దేశం మనది! నాలుగు ఆర్య సత్యాలను బోధించిన గౌతముడి పాదస్పర్శతో పావనమైన దేశం మనది! బౌద్ధమత వృక్షం పల్లవించిన పవిత్ర ప్రదేశం మనది! ఈ పున్నమే ఆ తథాగతుడి జయంతి. ప్రపంచమంతా బుద్ధ పూర్ణిమగా(Budha Purnima) వేడుకలు జరుపుకుంటున్నది.. మానవాళికి ఓ మార్గనిర్దేశం చేసిన బుద్ధ భగవానుడు జన్మించిన రోజది! అహింసో పరమోధర్మ అని చాటి చెప్పిన మహనీయుడు. మహాబోధి నీడలోన మహిమ గనిన గౌతముడు ఆయన! అన్ని దేశాల్లో అందరిలో ప్రసిద్ధుడాయన! వైశాఖ శుద్ధపూర్ణిమ రోజున లుంబినిలో బద్ధభగవానుడు జన్మించాడని అంటారు.ఆయన మహాబోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందింది క్రీస్తుపూర్వం 588లో. గౌతముడికి జ్ఞానోదయం అయిన రోజు. బుద్ధగయలో ఆయన నిర్వాణం. కుషి నగరంలో ఆయన పరినిర్వాణం జరిగిన సందర్భాలను పురస్కరించుకుని కూడా బౌద్ధ పౌర్ణిమను పాటిస్తారు కొందరు. బుద్ధపూర్ణిమను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుచుకుంటారు. పేర్లు ఎలా ఉన్నా ఈ పవిత్రమైన రోజున బౌద్ధులంతా ప్రశాంత మనసుతో. ఆ తథాగతుడి బోధనలు తల్చుకుంటారు. బౌద్ధ ఆరామాలను సందర్శిస్తారు. బౌద్ధ భిక్షువులకు అన్నపానీయాలను అందచేస్తారు. బుద్ధుడి విగ్రహాల ముందు దీపాలు. అగరొత్తులు వెలిగిస్తారు. పూలమాలలు సమర్పిస్తారు. పళ్లను నైవేద్యంగా అర్పిస్తారు.
