బుద్ధ భగవానుడి జయంతి వేడుకలను ఒక్కో దేశం ఒక్కో విధంగా జరుపుకుంటుంది. కొన్ని దేశాల్లో బుద్ధ పూర్ణిమకు(Buddha purnima) ముందే బుద్ధుడి జయంతిని జరుపుకుంటారు. ఇండోనేషియాలో(Indonesia) ముస్లిం(muslim) మహిళలు కూడా బుద్ధుడి జయంతిని జరుపుకుంటారు.

బుద్ధ భగవానుడి జయంతి వేడుకలను ఒక్కో దేశం ఒక్కో విధంగా జరుపుకుంటుంది. కొన్ని దేశాల్లో బుద్ధ పూర్ణిమకు(Buddha purnima) ముందే బుద్ధుడి జయంతిని జరుపుకుంటారు. ఇండోనేషియాలో(Indonesia) ముస్లిం(muslim) మహిళలు కూడా బుద్ధుడి జయంతిని జరుపుకుంటారు. బౌద్ధ ఆరాధకులతో కలిసి లాంతర్లను ఆకాశంలో వదులుతారు. బుద్ధ జయంతి రోజున బోరోబుదుర్‌ ఆలయంలో వెసాక్‌ డే ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.. దీపాల వెలుగులో ఆలయానికి కొత్త శోభను తీసుకొస్తాయి. నేపాల్‌లోనూ వైశాఖ పూర్ణిమ రోజునే బుద్ధ జయంతిని జరుపుకుంటారు.

బుద్ధుడు జన్మించిన నేల కాబట్టి నేపాల్‌ వాసులు చాలా ఘనంగా, గర్వంగా జరుపుకుంటారీ వేడుకను. జపాన్‌లో మాత్రం ప్రతి ఏడాది ఏప్రిల్‌ ఎనిమిదిన బుద్ధ జయంతిని జరుపుకుంటారు. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. తైవాన్‌లో మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని బుద్ధుడి జయంతిని జరుపుకుంటారు. ఆ రోజునే ప్రపంచమంతా మదర్స్‌ డేను జరుపుకుంటుంది. కంబోడియాలో బుద్ధ భగవానుడి జయంతిని విసాక్‌ బొకిగా పిలుచుకుంటారు.

ఆ రోజున పబ్లిక్‌ హాలీడే! బౌద్ధ భిక్షవులంతా జయపతాకాలతో ఊరేగింపు తీస్తారు. కమలం పువ్వులతో బుద్ధుడికి పూజలు చేస్తారు. కొవ్వొత్తులను వెలిగిస్తారు. చైనాలో ఉన్న బౌద్ధ ఆలయాలు ఆ రోజున అందంగా ముస్తాబవుతాయి. దీపాల వెలుగులో దేదీప్యమానమవుతాయి. ప్రజలు బౌద్ధ సన్యాసులకు ఆతిథ్యమిస్తారు. చైనాలో కూడా పబ్లిక్‌ హాలిడేనే! కొరియాలో సీగా తన్‌సినిల్‌గా పిలుచుకుంటారు. తామరపువ్వు ఆకారంలో ఉన్న దీపాలు ఆలయాలకు కొత్త శోభను ఇస్తాయి.

ఇక మలేషియాలో వెసాక్‌ డేగా జరుపుకుంటారు. మయన్మార్‌లో కసాన్‌ పున్నమిగా బుద్ధజయంతిని జరుపుతారు. బోధి వృక్షాలకు పూజలు చేస్తారు. మొక్కలను నాటుతారు. శ్రీలంకలో వెసాక్‌ తోరణగానూ, పిలియందలగానూ జరుపుకుంటారు. సరస్సుల్లో దీపాలను వదులుతారు. ఇక్కడ కూడా వైశాఖమాసం పున్నమి రోజునే బుద్ధ జయంతిని జరుపుకుంటారు. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశాలలో ఉన్న బౌద్ధులు కూడా ఈ ఉత్సవాలను ఎంతో గొప్పగా జరుపుతారు.

Updated On 5 May 2023 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story