ఇవాళ బుద్ధ పూర్ణిమ(Budha Purnima). బుద్ధుడు పుట్టింది ఈ రోజునే. అందుకే ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ వేడుకలు ఇటు భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని బౌద్ధులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఇవాళ బుద్ధ పూర్ణిమ(Budha Purnima). బుద్ధుడు పుట్టింది ఈ రోజునే. అందుకే ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ వేడుకలు ఇటు భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని బౌద్ధులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బుద్ధ పౌర్ణమిని మహా వైశాఖి(Maha vaishaki) అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి ఆధ్యాత్మిక పనులు చేసినా తప్పకుండా విజయం సాధిస్తారని విశ్వాసం. వైశాఖ పూర్ణిమకు బుద్ధునికి అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ రోజే మూడు సార్లు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి కాబట్టి బుద్ధుని జీవితంలో వైశాఖ పౌర్ణమికి ప్రాధాన్యం ఉంది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు సిద్ధార్ధుడిగా జన్మించారు. వైశాఖ పూర్ణిమ రోజే సిద్ధార్ధుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారారు. ఇదే వైశాఖ పూర్ణిమనాడు బుద్దుడు నిర్యాణం చెందారు. ఈ సంవత్సరం 2024లో బుద్ధ పూర్ణిమ గురువారం, మే 23న వస్తుంది. ఈ రోజు కూడా వైశాఖ మాసం పౌర్ణమి రోజు, ఇది చాలా పవిత్రమైన రోజు. బుద్ధుడు మానవుని కష్టాలకు కారణం శోధిస్తూ దేశాటన చేస్తూ చివరకు గయలో బోధి వృక్షం కింద కోరికలే మానవుని దుఃఖానికి కారణమన్న నగ్నసత్యం తెలుసుకుంటాడు. ఏ బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందో బుద్ధ పూర్ణిమ రోజు ఆ బోధి వృక్షాన్ని పూజిస్తారు...