లక్నోలో(Lucknow) ఈరోజు జరిగిన బీఎస్పీ(BSP) సమావేశంలో కీలక ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో బహుజన్‌ సమాజ్‌పార్టీ(Bahujan Samaj Party) అధినేత్రి మాయావతి(Mayavathi) కీలక ప్రకటన చేశారు. బీఎస్పీకి కాబోయే నేత, తన మేనల్లు ఆకాష్‌ ఆనంద్‌(Akash nand) పేరును ఆమె ప్రకటించారు. తన వారసుడు ఆకాష్‌ ఆనందేనని కీలక ప్రకటన చేయడంతో.. ఆ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.

లక్నోలో(Lucknow) ఈరోజు జరిగిన బీఎస్పీ(BSP) సమావేశంలో కీలక ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో బహుజన్‌ సమాజ్‌పార్టీ(Bahujan Samaj Party) అధినేత్రి మాయావతి(Mayawathi) కీలక ప్రకటన చేశారు. బీఎస్పీకి కాబోయే నేత, తన మేనల్లు ఆకాష్‌ ఆనంద్‌(Akash nand) పేరును ఆమె ప్రకటించారు. తన వారసుడు ఆకాష్‌ ఆనందేనని కీలక ప్రకటన చేయడంతో.. ఆ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.

గత ఏడాది కాలంగా ఆకష్ ఆనంద్‌ బీఎస్పీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మాయావతికి స్వయాన తమ్ముడి కుమారుడు ఆకాష్‌ ఆనంద్‌. 2016లో పార్టీలో చేరిన ఆకాష్‌.. 2019లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. 2022లో రాజస్తాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ చేపట్టిన పాదయాత్రతో.. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పార్టీ చేపట్టిన స్వాభిమాన్‌ సంకల్ప్‌ యాత్రలో ఆకాష్‌ ముఖ్య పాత్ర పోషించారు. మాయావతి తర్వాత బీఎస్పీలో కీలక నేతగా ఆకాష్‌కు గుర్తింపు ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తన వారసుడిని ప్రకటించడంతో ఎన్నికలకు సిద్ధమవుతన్నట్లు మాయావతి చెప్పకనే చెప్పారు. ఆకాష్ ఆనంద్‌ ఆధ్వర్యంలో పార్టీ బలంగా మారుతుందని, లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తామని మాయావతి భావిస్తున్నారట. ఆకాష్‌ పేరు ప్రకటించడంతో మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు వెరు చేపడతారన్న వార్తలకు చెక్‌ పెట్టారనే చెప్పొచ్చు.

Updated On 10 Dec 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story