దేశ రాజధాని ఢిల్లీలో(delhi) బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం(BRS Party office) తెలంగాణ భవన్ ఇవాళ ప్రారంభం కానుంది. వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు( CM KCR) మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు సీఎం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం(sudharshana pooja), వాస్తుపూజల్లో(vasthu pooja) పాల్గొంటారు.
దేశ రాజధాని ఢిల్లీలో(delhi) బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం(BRS Party office) తెలంగాణ భవన్ ఇవాళ ప్రారంభం కానుంది. వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు( CM KCR) మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు సీఎం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం(sudharshana pooja), వాస్తుపూజల్లో(vasthu pooja) పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. తర్వాత పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.
భూమిపూజ జరిగిన 29 నెలల్లోనే కార్యాలయ నిర్మాణం పూర్తవ్వడం మరో విశేషం. 2019, జనవరి ఏడో తేదీన ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ ఎంపీల బృందం ఓ వినతి పత్రాన్ని అందించింది. 2020, అక్టోబర్ 9న ఢిల్లీలోని వసంతవిహార్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ల్యాండ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దీన్‌దయాళ్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. అదే సంవత్సరం నవంబర్ 4న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి భూమి పత్రాలు అందించారు.
2021, సెప్టెంబర్ 2న కార్యాలయ భవనానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 1327 చదరపు గజాల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. ఇందుకు అయిన ఖర్చు 8.64 కోట్ల రూపాయలు. 22, 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం ఉంది. మొత్తం నాలుగు అంతస్థులు ఉన్నాయి. లోయర్ గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, నాలుగు ప్రధాన కార్యదర్శుల ఛాంబర్‌లు ఉన్నాయి. మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఛాంబర్, ఇతర ఛాంబర్లు, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. రెండు, మూడు అంతస్థుల్లో మొత్తం 20 గదులున్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ కూడా ఉన్నాయి.