ఢిల్లీ లిక్కర్‌ పాలసీ(Delhi liquor policy) సీబీఐ(CBI) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ(Delhi liquor policy) సీబీఐ(CBI) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌(Default Bail Petition)ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)ఉపసంహరించుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదే పిటిషన్‌పై నిన్న సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ తన తరుఫున వాదించే సీనియర్‌ న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మరో రోజు విచారణ చేపట్టాలని కోరారు. కానీ అనూహ్యంగా ఈ రోజు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అయితే పిటిషన్‌ ఉపసంహరణ ఎందుకన్న ప్రశ్న చాలా మందికి కలుగుతోంది. అసలు ఏమై ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు. అయితే బెయిల్ కోసం కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీం కోర్టు(SuprimeCourt)ను ఆశ్రయించి.. అక్కడి నుంచి బెయిల్‌ పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రౌస్‌ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురవుతుండటంతో న్యాయ బద్దంగా బెయిల్‌ పొందేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. సీబీఐ ఛార్జ్‌ షీట్‌(CBI Charge Sheet)లో తప్పులు ఉన్నాయని జులై 6వ తేదీన కవిత తన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆ ఛార్జ్‌షీట్‌లో తప్పులు లేవని సీబీఐ తరుఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు న్యాయవాది రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా(Justice Kaveri Baweja)కు విన్నవించారు. దాంతో న్యాయమూర్తి ఈ కేసును చివరిసారి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. బుధవారం విచారణ సమయంలో వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని న్యాయవాదికి సూచించారు. ఈ కేసు విచారణ ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. ఆగస్ట్‌ 9వ తేదీకి వాయిదా వేశారు. రేపు కోర్టులో విచారణ జరగనుండగా.. అనూహ్యంగా డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అయితే త్వరలోనే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

ehatv

ehatv

Next Story