ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) మూడు రోజుల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న కవిత (MLC Kavitha) హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకుకి వచ్చారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ (Harish Rao) మరి కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో (CM KCR) భేటీ అయ్యారు. ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు వివరించనున్నారు కవిత. ఇవాళ మొత్తం కవిత ప్రగతి భవన్ లోనే (Pragathi Bhavan) ఉండనున్నారు.ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు వివరించి.. తదుపరి న్యాయనిపుణులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

brs mlc kavitha meets cm kcr at pragathi bhavan after ed investigation on delhi liquor scam case
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) మూడు రోజుల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్న కవిత (MLC Kavitha) హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకుకి వచ్చారు. కవిత వెంట మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ (Harish Rao) మరి కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో (CM KCR) భేటీ అయ్యారు. ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు వివరించనున్నారు కవిత. ఇవాళ మొత్తం కవిత ప్రగతి భవన్ లోనే (Pragathi Bhavan) ఉండనున్నారు.ఈడీ విచారించిన తీరును కేసీఆర్ కు వివరించి.. తదుపరి న్యాయనిపుణులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ ఎప్పుడు హాజరు కావాలన్నదానిపై సమాచారం పంపుతామని ఈడీ చెప్పినప్పటికీ..ఇంత వరకూ ఎలాంటి సమాచారం లేదు. దీంతో కవిత మళ్లీ ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారన్నదానిపై క్లారిటీ లేదు. అసలు విచారణ మళ్లీ ఎప్పుడు ఉంటుందన్నదానిపైనా స్పష్టత లేదు.
ఈడీ దర్యాప్తుపై కవిత వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో (Supreme Court) మార్చి 24న విచారణ జరగనుంది. కవిత వేసిన పిటిషన్ పై ఈడీ వేసిన కేవియట్ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు అదే రోజున విచారించనుంది.ఇరు వర్గాల వాదనలను సుప్రీంకోర్టు విననుంది. ఈడీ విచారణకు పిలవడంపై స్టే ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. సిఆర్పీసీ నిబంధనలకు ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని..కానీ అందుకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తుందని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తనకు ఇచ్చిన ఈడీ నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని, అందుకు విరుద్ధంగా ఈడీ (ED) అధికారులు వ్యవహరించారని కవిత ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్లు సీజ్ చేశారని కవిత ఆరోపించారు.
మరోవైపు కవిత పిటిషన్ విషయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తులను విచారిస్తున్న ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.తమ వాదనలు వినకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తన పిటిషన్ లో ప్రస్తావించింది ఈడీ. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది ఈడీ. ముందుగా సుప్రీంకోర్టు విచారణపూర్తయ్యే వరకూ విచారణకు హాజరయ్యేది లేదని సీబీఐకి (CBI) లేఖ రాసిన కవిత..ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. వరుసగా రెండు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇరవై నాలుగో తేదీన సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ కీలకం కానుంది.
