దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi liquor case) ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియదు కానీ మలుపులు మాత్రం అనేకం తిరుగుతోంది. ఆరోపణలను ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వడం, వాటిని వారు దాట వేయడం, మళ్లీ సమన్లు జారీ చేయడం, మరోసారి వాటిని దాటవేయడం రివాజుగా మారింది. ఈ క్రమంలోనే ఈ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) ఈడీ(ED) ఏడోసారి నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi liquor case) ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియదు కానీ మలుపులు మాత్రం అనేకం తిరుగుతోంది. ఆరోపణలను ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వడం, వాటిని వారు దాట వేయడం, మళ్లీ సమన్లు జారీ చేయడం, మరోసారి వాటిని దాటవేయడం రివాజుగా మారింది. ఈ క్రమంలోనే ఈ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) ఈడీ(ED) ఏడోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఇప్పటికే ఆరుసార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ ఏసింది. ఒక్కసారి కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు. లిక్కర్ కేసు వ్యవహారం కోర్టులో ఉన్న తరుణంలో విచారణకు నోటీసులు పంపించడం చట్ట విరుద్ధమన్నది ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) వాదన. ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ ఇంతకుముందు చాలా సీరియస్‌గా స్పందించారు.
తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే ఈడీ నోటీసులు పంపుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడంతో మనీ లాండరింగ్ కేసులో విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోవడంపై ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈడీ ఫిర్యాదుపై ఇటీవల కోర్టు సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థాన విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణకు హాజరవుతానని అన్నారు. అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా తాజాగా కేజ్రీవాల్‌కు ఈడీ ఏడో సారి సమన్లు జారీ చేయడం ఉత్కంఠ రేపుతుంది. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను ఈడీ విచారణకు పిలిచిన రోజే కవితను కూడా 26న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం రెండు సార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.