రెజ్లర్ల(wrestlers) ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(K.Kavitha) స్పందించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్(Brij Bhushan Sharan Singh) పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.
రెజ్లర్ల(wrestlers) ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(K.Kavitha) స్పందించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్(Brij Bhushan Sharan Singh) పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచిన రెజ్లర్ల ఆందోళనలనే కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రెజ్లర్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని కోరారు. మహిళా రెజ్లర్లు ఎంతో కష్టపడి.. నిబద్ధతతో ప్రపంచానికి భారత దేశ ప్రతిభను చాటారని పేర్కొన్నారు.
దేశ ప్రయోజనాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రెజ్లర్ల సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోస్కో వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పటికీ బ్రిజ్ భూషణ్ బయట తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయాన్ని నిరాకరిస్తూ.. మహిళ క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. రెజర్ల నిరసనలను మొత్తం ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాన్ని కోరుకుంటున్నారని.. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలని సూచించారు.