లేదు లేదంటున్నారు కానీ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) పార్టీ మారేట్టుగానే ఉన్నారు. బీఆర్‌ఎస్‌లో(BRS) ఉంటే మనుగడ కష్టమని భావించారో లేక కాంగ్రెస్‌లో చేరితే తమ జోలికి ఎవరూ రారని అనుకున్నారో తెలియదు కానీ హస్తం పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతున్నట్టు సమాచారం.

లేదు లేదంటున్నారు కానీ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) పార్టీ మారేట్టుగానే ఉన్నారు. బీఆర్‌ఎస్‌లో(BRS) ఉంటే మనుగడ కష్టమని భావించారో లేక కాంగ్రెస్‌లో చేరితే తమ జోలికి ఎవరూ రారని అనుకున్నారో తెలియదు కానీ హస్తం పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన కర్ణాటక(Karnataka) డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌ను(DK Shivakumar) కలిశారు. తన వెంట కొడుకు భద్రరెడ్డిని కూడా తీసుకెళ్లారు. బెంగళూరులోని ఒక ప్రయివేటు హోటల్‌లో భేటి జరిగింది. ఈ సమావేశం రాజకీయవర్గాలలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated On 14 March 2024 3:30 AM GMT
Ehatv

Ehatv

Next Story