తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో కాంగ్రెస్(congress) పార్టీ అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఒకట్రెండు మినహా ఏదీ అమలు కాలేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో కాంగ్రెస్(congress) పార్టీ అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఒకట్రెండు మినహా ఏదీ అమలు కాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్(BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు వేశారు. ఆరు గ్యారంటీలు ఏమిటో ఆయన చెబుతూ వాటిని తెలంగాణ ప్రజలు ఇంట్లో నిల్వ చేసి పెట్టుకోవడం మంచిదని రిక్వెస్ట్ చేశారు. అవి ఏమిటంటే 1. ఇన్వర్టర్(Inverter). 2. ఛార్జింగ్ బల్బులు(charging bulbs). 3. టార్చ్ లైట్లు(torch Light). 4. కొవ్వొత్తులు(Candles). 5. జనరేటర్లు(Genrators). 6. పవర్ బ్యాంకులు(Power banks). వీటీనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలుగా హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదు అని చెబుతూ అందుకే మే 13 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు తెలివిగా ఆలోచించి ప్రజలంతా ఓటు వేయాలన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ ప్రజలను కోరారు.