వాట్సప్‌ యూనివర్సిటీలో జ్ఞానం డ్రైనేజ్‌ మురిగి కాలువలా పొంగి పొర్లుతుంటంది. నానా చెత్తను వాట్సప్‌లో వేసేసి ఆనందపడిపోతుంటారు కొందరు. అన్నట్టు ఇలాంటి అవాస్తవాలను, చరిత్ర వక్రీకరణలను ప్రమోట్‌ చేయడానికి కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులు ఉంటారు. గమ్మత్తేమిటంటే ఈ వాట్సప్‌తో నాలెడ్జ్‌ పెంచుకుంటున్న రాజకీయ నాయకులు కూడా తమ వాదననే కరెక్ట్‌ అని చెప్పుకోవడం. ఇప్పుడు దేశం సార్వత్రిక ఎన్నికలకు(General Elections) సిద్ధం అవుతోంది.

వాట్సప్‌ యూనివర్సిటీలో జ్ఞానం డ్రైనేజ్‌ మురిగి కాలువలా పొంగి పొర్లుతుంటంది. నానా చెత్తను వాట్సప్‌లో వేసేసి ఆనందపడిపోతుంటారు కొందరు. అన్నట్టు ఇలాంటి అవాస్తవాలను, చరిత్ర వక్రీకరణలను ప్రమోట్‌ చేయడానికి కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులు ఉంటారు. గమ్మత్తేమిటంటే ఈ వాట్సప్‌తో నాలెడ్జ్‌ పెంచుకుంటున్న రాజకీయ నాయకులు కూడా తమ వాదననే కరెక్ట్‌ అని చెప్పుకోవడం. ఇప్పుడు దేశం సార్వత్రిక ఎన్నికలకు(General Elections) సిద్ధం అవుతోంది. ఇలాంటి సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. రాజకీయ నాయకులు కూడా ఏది పడితే అది మాట్లాడి చులకన కావద్దు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఇది. కానీ కొందరు మాత్రం తమకు తెలిసిందే జ్ఞానం అనుకునేసి దాన్ని ఇతరులకు పంపే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇద్దరు బీజేపీ(BJP) నేతలు ఇలా తమకు తోచింది చెప్పేసి వైరల్ అయ్యారు. ఈ వీడియోలో మన దేశ ప్రధానుల విషయమై బీజేపీ నేతలిద్దరూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై(Annamalai) ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ(Mahathma gandhi) మన దేశ ప్రధాని అన్నారు. ఇక, ఈసారి హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రనౌత్‌(kangana ranaut) ఓ టీవీ ఇంటర్వ్యూలో మన దేశ మొదటి ప్రధాని సుభాష్‌ చంద్రబోస్‌(Subhash Chandrabose) అని అన్నారు. ఇంకా నయం వీరిద్దరు సావార్కర్‌ పేరు చెప్పలేదు. ఇప్పుడు వీడియో బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) కంటపడింది. ఆయన వెంటనే ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. వీరంతా ఎక్కడ చదువుకున్నారంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. వీరు వాట్సప్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన విషయం కేటీఆర్‌కు తెలియదు కాబోలు!

Updated On 5 April 2024 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story